శుక్రవారం, సెప్టెంబర్ 10, 2010
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్‌శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||
గురువారం, సెప్టెంబర్ 09, 2010
వినాయకుని ఆకారంలో మనంనేర్చుకోవలసినవి ఇమిడివున్నాయి కావాలంటే మీరే చూడండి.
వినాయకుని తొండం
ఓంకారాన్ని పోలి వుంటుంది.
ఏనుకు తల జ్ణానానికి , యోగ మునకు గుర్తు.
మానవశరీరము మాయ కు ప్రకృతికి సంకేతము.
చేతిలో పరసు అజ్ణానాన్ని పారద్రోలేది.
మరోచేతిలో కత్తి విఘ్నాలను పోగొట్టే సాధనం.
విరిగిన దంతం త్యాగానికి గుర్తు.
మాల జ్ణానాన్ని సంపాదించేది.
పెద్దచేవులు అందరి మాటలు జాగ్రత్తగా వినాలి.
బొజ్జమీద నాగబందం శక్తికి,కుండలినికి గుర్తులు.
ఎలుక వాహనం అన్ని జీవులను సమానంగా ప్రేమించగలగాలి.
చూసారా మరి వినాయకుని ఆకారం లో ఎంత గొప్ప జ్ణానం దాగివుందో.
బుధవారం, సెప్టెంబర్ 08, 2010
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ