Blogger Widgets

గురువారం, నవంబర్ 15, 2012

కార్తిక పురాణం 2వ రోజు

గురువారం, నవంబర్ 15, 2012

 
బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు.
''రాజాఈ కార్తీకమాసంలో స్నాన దాన జపాల్లో దేనినైనాకొద్దిపాటిగా ఆచరించినా సరే.. అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుందిఎవరైతే,సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరిన్చారో అలాంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
పౌర్ణమ్యాం కార్తీకమాశ స్నానాందీస్తు నాచారాన్|
కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప||
క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః|
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం||
భావం:
కార్తీక పౌర్ణమినాడుస్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు చండాల జన్మలు ఎత్తిచివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారుఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి..
తత్వనిష్ఠోపాఖ్యానం

పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడుసకల శాస్త్ర పారంగతుడుఅసత్యాలను పలకనివాడుభూతదయ గల దయాళువూతీర్థాటనప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్ధయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరీ తీరాన ఉన్న ఒకానొక ఎత్తయిన మర్రిచెట్టు మీద కారునలుపు శరీర ఛాయ గలవారుఎండిన డొక్కలుఎర్రని కళ్ళుపెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడిఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులుకపాలాలూ ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు.  ఆ రాక్షసులవల్ల భయంచేత మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళదూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదుఅటువంటి భయకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడుదాంతోబాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు.
తత్వనిష్ఠుడి శరణాగతి

త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్|
త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశత్వట్టోహం జగదీశ్వర||
భావం:  
''దేవతలకూలోకాలకూ కూడా యజమానివి అయినవాడానారాయణాఅవ్యయానన్ను కాపాడుఅన్నిరకాల భయాలనూ అంతం చేసేవాడానిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించుఓ జగదీశ్వరానువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడనునన్ను అన్నివిధాలా కాపాడు'' అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడినుంచి పారిపోసాగాడుఅతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకే పరిగెత్తసాగిందిరాక్షసులు దగ్గరౌతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవడంవల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడంవల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయిందిఅదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి దండప్రణామం చేసిఅతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టామని నమ్మబలికి ''ఓ బ్రాహ్మణుడానీ దర్శనంతో మా పాపాలు నసిమ్చిపోయాయి'' అని మళ్ళీ నమస్కరించారు.  వారి నమ్రతకు కుదుటపడిణ హృదయంతో తత్వనిష్ఠుడు ''మీరెవరుచేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారుమీ మాటలు వింటే బుద్దిమంతుల్లా ఉన్నారుమరి ఈ వికృత రూపాలేమిటినాకు వివరంగా చెప్పండి.. మీ భయాలుబాధలు తొలిగే దారి చెప్తాను'' అన్నాడు.
 ద్రావిదుని కథ

పారుని పలుకులపైఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు.
''విప్రోత్తమానేను ద్రావిడినిద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాదికారినికావడానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని,వంచించే చమత్కారిగా ఉండేవాణ్ణిణా కుటుంబ శ్రేయస్సుకై అనేకమంది విప్రుల విత్తాన్ని హరించానుబంధువులకు గానీ,బ్రాహ్మణులకు గానీ ఏనాడూ పట్టెడు అన్నం పెట్టలేదునయ వంచానలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంవల్ల ణా కుటుంబం నాతొ సహా ఏడు తరాలవాళ్ళు అథోగతి పాలయ్యారు.
మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యానుకృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు'' అన్నాడు. 
ఆంధ్రదేశీయుని గాథ

రెండవ రాక్షుసుడు ఇలా విన్నవించుకున్నాడు.
''ఓ బ్రాహ్మణోత్తమానేను ఆంధ్రుడినినిత్యం ణా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడినినేను ణా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నం పెట్టేవాడినిబాంధవ బ్రాహ్మణకోటికి ఎన్నడూ ఒక పూటయినా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడినిచనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతిఘోరమైన భాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించానుఆ ద్రావిడునికి మల్లేనే నాక్కూడా ముక్తి కలిగే మార్గం బోధించు''
పూజారి కథ
మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ''ఓ సదాచార సంపన్నుడానేను ఆంధ్రదెస బ్రాహ్మణుడినివిష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడినికాముకుడనుఅహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడినిభక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చివిష్ణు సేవలను సక్రమమంగా చేయక గర్వంతో తిరిగేవాడినిచివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించివేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా గడిపేవాణ్ణిపాపపుణ్య విచక్షణ తెలిసేది కాదునా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుని అయ్యానుఓ విప్రుడానన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు'' అని ప్రార్ధించాడు.
 బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట

తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు ''భయపడకండినాతొ కలిసి కార్తీక స్నానానికి రండిమీ సమస్త దోషాలూ నశించిపోతాయి'' అని చెప్పి వారిని తన వెంట తీసికెళ్ళాడు.  అందరూ కలిసి కావేరీనది చేరారుఅక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా మున్ డు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడుతర్వాత
అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్ధం |
అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే | |
అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసితత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులూ,దివ్యరూపులూ అయితక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
విదేహరాజాఅజ్ఞానం వల్ల కానీమోహప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుందిఅందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలికావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతఃకాల స్నానం చేయాలిఅలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు.
కనుక ఎటువంటి మీమాంసలూ లేకుండా స్త్రీలు గానీపురుషులు గానీ కార్తీకమాసంలో తప్పక ప్రాతఃస్నానం చేయాలి.  అప్పుడు జనకుడు ''హే బ్రహ్మర్షీనువ్వు ఇంతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావుఅయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరిన్చాలోఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి'' అనడిగాడు.
వశిష్ట ఉవాచ: 

అన్ని పాపాలనూ హరించేదిపుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయంకార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదుఅంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలనుతత్ఫలితాలను చెప్తాను విను.
 కార్తీకమాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుందిశివాలయ గోపురద్వారా,శిఖరాలయందు గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయిఎవరయితే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలౌతారుఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారుకాంక్షతో గానీ కనీసం నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులౌటారుఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను.
కార్తీక 
దీపారాధన మహిమ


పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీకుమారులు లేని కారణంగా కుంగిపోయికురంగపాణికై తపస్సు చేశాడుమధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ''ఓ రాజాఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదుకార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించిబ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టుఅలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది'' అని చెప్పాడుఋషి వాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాన్చాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించిశివప్రీతికై బ్రాహ్మణులకు దీప దానములు చేశాడుతత్ఫలితంగా మహారాణి నెల తప్పియుక్తకాలంలో మగ శిశువును ప్రసవించిందిరాజా దంపతులు ఆ శిశువుకు ''శత్రుజిత్తు'' అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు చరిత్ర
శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగియువకుడైవీరుడై వేశ్యాంగనా లోలుడై ఇంకా తృప్తి చెందక పర స్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడుహితవు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమ హీనంగా జీవిస్తున్నాడుఇలా ఉండగా ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడుఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది.  భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేదిఇద్దరూ ఆనందించేవారుఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది.కానీఆ విప్రుడు పైకి ఏమీ తెలీనట్లు ఉన్నాడుఇద్దరూ కలిసుండగా చూసి చంపాలి అనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడువారికి ఈ సంగతి తెలీదుఒక కార్తీక పౌర్ణమినాడు సోమవారం కలిసివచ్చిందిఆవేళ కాముకులిద్దరూ సురత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారుఅపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారుఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్ర స్త్రీ తన చీర కొంగును చింపిఒత్తిని చేసిందిరాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలో పోశాడుమొత్తానికి దీపం వెలిగించారుఇక ఇద్దరూ ఏకమయ్యారు.
విప్రుడు అక్కడికొచ్చివారిద్దర్నీ చంపేసితాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడుఅటు యమదూతలుఇటు శివ దూతలూ కూడా వచ్చారుశివదూతలు విప్ర స్త్రీనిరాజును కైలాసానికి తీసికెళ్ళారుయమదూతలు విప్రుని నరకానికి లాక్కేళుతుంటే అతను ఆక్రందన చేస్తూ ''పాపం చేసినవారికి కైలాసంనాకేమో నరకమా?'' అన్నాడుఅందుకు యమదూతలు''వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమిపైగా సోమవారంఏ కారణం అయితేనేం దీపం వెలిగించారుఅందునా ఆలయంలో వెలిగించారుకనుక పుణ్యాత్ములయ్యారుఅలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావుఅందుకే వారికి కైలాసంనీకు నరకం'' అన్నారు.
బ్రాహ్మణుడికీశివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని ''అయ్యాదోషం చేసింది మేముమాకు కైవల్యం ఇచ్చిఈ పుణ్యదినాన మమ్మల్ని చంపిమాకు స్వర్గప్రాప్తి కలగాజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు.
కార్తీకమాసం గొప్పది అయితేసోమవారం ఇంకా పుణ్యమైంది అయితేదీపారాధన మరీ పుణ్యప్రదమైంది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు'' అని వాదించాడుఫలితంగా శత్రుజిత్తు తానూతన ప్రేయసి చేసిన ఒత్తులుఆముదం పుణ్యం తాము ఉంచుకునిదీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసికెళ్ళారు.  కనుకఓ మిధిల నగరాధీశ్వరాకార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీవిష్ణుఆలయంలో గానీ దీపారాధన చేసి తీరాలి.నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులైతద్వారా మోక్షాన్ని పొందగల్గుటారుఅందునా శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించునా మాట విని కార్తీకమాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి''

బుధవారం, నవంబర్ 14, 2012

కార్తీక పురాణం 1వ రోజు

బుధవారం, నవంబర్ 14, 2012


సూతుడు కార్తీక మహా పురాణాన్ని ఇలా చెప్పసాగాడు... 
పూర్వం నైమిశారన్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి, సంతుషుని చేసి కైవల్యదాయకం అయిన కార్తీకమాశ మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతముని.   ''శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని ''అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిషుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేలావిలాస బాలమణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యమును సవివరంగా ఉన్నది. మన అదృష్టంవల్ల నేతి నుండి కార్తీక మాసం ప్రారంభం. కావున ప్రతిరోజూ నిత్య పారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి..'' అంటూ చెప్పసాగాడు.  

జనకుడు వశిష్టుని కార్తీక వ్రాత ధర్మములు అడుగుట.. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్నా యోగానికి అవసరమైన ద్రవ్యార్ది అయిన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు.  అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ''హే బ్రహ్మర్షీ! మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి.. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కూడా కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని, చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది.. ఆ వ్రతం ఉత్క్రుష్ట ధర్మం ఏ విధంగా అయింది'' - అని అడుగగా మునిజన విశిష్టుడైన వశిష్టుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు. జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది, విన్నంతమాత్రంచేత అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను, విను.. 

కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో.. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమనాడిగా గానీ, శుద్ధ పాడ్యమి నుండి గానీ ప్రారంభించాలి. ముందుగా - ''సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే'' ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రీ'' అని నమచేసిస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి. 

కార్తీకమండలి సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే, గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశాయాల్లో కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.
అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ళ నీళ్ళను గట్టుమీదికి జల్లి తీరం చేరాలి. చేరగానే కట్టుబత్తలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి మది వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పున్ద్రాలను ధరించి, సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి.  తర్వాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను, శంఖ చక్రదారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివి గానీ విని గానీ స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆపైన ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి.   సాయంకాలం కాగానే ఇతర పనులన్నిటినీ విరమించుకుని శివాలయంలో కానీవిష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించిదేవుని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిణి స్తుతించి నమస్కరించుకోవాలి.  కార్తీకమాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారుప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయివర్ణాశ్రమ లింగావయో బేధరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరేవాళ్ళు మొక్షార్హులు కావడం నిస్సంశయం.  జనకరాజాతనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినాఇతరులు చేస్తుండగా చూసిఅసూయారహితుడై ఆనందించేవారికి ఆరోజు చేసిన పాపాలన్నీ విశ్నుక్రుపాగ్నిలో ఆహుతైపోతాయి.
కార్తీక సోమవార వ్రతం:

వశిష్ఠ ఉవాచ:   హే జనకమహారాజావినినంత మాత్రంచేతనే మనోవాక్కాయకర్మల ద్వారా చేసిన సర్వ పాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను.. ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు.కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నానజపాడులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారుఈ సోమవారా వ్రాత విధి రకాలుగా ఉంది.   1.ఉపవాసం 2. ఏకభక్తం 3. నక్తం 4.అయాచితం 5.స్నానం 6. తిలాపాపం

ఉపవాసం:  చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉందిసాయకాలం శివాభిషేకం చేసినక్షత్ర దర్శనానంతరం తులసితీర్థం మాత్రమే సేవించాలి
ఏకభక్తం:  సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించిమధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్ధమో తులసి తీర్ధమో తీసుకోవాలి.

నక్తం:  పగలంతా ఉపవాసం ఉందిరాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి.
అయాచితం:  భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలిదీన్నే అయాచితం అంటారు.
స్నానం:   పైన సూచించిన వాటికి వేటికీ శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.
తిలాపాపం: 
మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది.


పై ఆరు పద్ధతుల్లో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుందికానీతెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యంఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాధలుస్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారుకార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించిరాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.  సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలిఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తానువినండి.


నిష్టురి కథ:  పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేదిఆమె అందంగాఆరోగ్యంగావిలాసంగా ఉండేదిఅయితే సద్గుణాలు మాత్రం లేవుఅనేక దుష్ట గుణాలతో గయ్యాళిగాకాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాలకారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు.

నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైణ మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించిచేతులు దులుపుకున్నాడుమిత్రశర్మ చదువుసదాచారాలు ఉన్నవాడుసద్గుణాలు ఉన్నాయిసరసమూ తెలిసినవాడుఅన్నీ తెలిసినవాడు కావడాన కర్కశ ఆడింది ఆటగాపాడింది పాటగా కొనసాగిందిపైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూకొడుతూ ఉండేదిఅయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడుపైగా పరువు పోతుందని ఆలోచించాడుకర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్పఆమెను ఎన్నడూ శిక్షించలేదుఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెత్తుకుని౮ భర్తనుఅతని తల్లితండ్రులను హింస పెట్టేది.
ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపిందిశవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది.ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలుదుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండాతామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.  అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయిందికామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుందిపైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగిందిచివరికి ఆమె జబ్బులపాలయిందిపూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది.విటులు అసహ్యంతో రావడం తగ్గించారుసంపాదన పోయిందిఅప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారుఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదుచివరికి తినడానికి తిండి లేకఉండటానికి ఇల్లు లేకఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుందియమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్ళి శిక్షించారు.  భర్తను హింసించిన కర్కశకు భయానక నరకం

భర్తను విస్మరించిపర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలిముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారురాతిమీద వేసి చితక్కొట్టారుసీసం చెవుల్లో వేశారుకుంభీపాక నరకానికి పంపారుఆమె చేసినా పాపాలకు గానూ ముందు పది తరాలువెనుక పది తరాలుఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కుంభీపాక నరకానికి పంపారుఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.
సోమవార వ్రత ఫలంవల్ల కుక్క కైలాసం చేరుట:
ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుదు పగలు ఉపవాసం ఉండిశివాభిభిషేకం మొదలైనవి చేసినక్షత్ర దర్శనానంతరం నకట స్వీకారానికి సిద్ధపడిఇంటి బయట బలిని విడిచిపెట్టాడుఆరోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించిందిబలి భోజనం వల్ల డానికి పూర్వ స్మృతి కలిగి ''ఓ విప్రుడానన్ను రక్షించు'' అంటూ మూలిగిందిఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ''ఏం తప్పు చేశావు.. నిన్ను నేను ఎలా రక్షించగలను?!'' అనడిగాడు.

అప్పుడు కుక్క ''ఓ బ్రాహ్మణుడాపూర్వజన్మలో నేనొక విప్ర వనితనుకామంతో ఒళ్ళు తెలీక జారత్వానికి ఒడికట్టానుపతితను,భ్రష్టను అయిభర్తను కూడా చంపానుఆ పాపాలవల్ల నరకానికి వెళ్ళాను...'' అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది.చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటంలేదు, దయచేసి చెప్పు'' అంది.
బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని ''శునకమాఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకూ పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదాఅందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది..'' అన్నాడు.

డానికి కుక్క ''కరుణామయుడివైన ఓ బ్రాహ్మణానాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు'' అని అడిగింది.
దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ సరీరిని అయిప్రకాశ మానహార వస్త్ర్ర విభూషిత అయిపితృ దేవతా సమంవితయై కైలాసం చేరిందికనుకనే ఓ జనక మహారాజానిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు'' అంటూ చెప్పాడు వశిష్టుడు.

బాలలదినోత్సవ శుభాకాంక్షలు .

పిల్లల కు ఒక రోజు వుంది.  ఆ రోజు పిల్లలకు ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తముగా బాలల దినోత్సవం ను ప్రతి సంవత్సరం  నవంబర్ 20 న జరుపుకుంటారు.

పండితుడు జవహర్ లాల్ నెహ్రూ - నవంబర్ 14  న పురాణ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించినారు.   నెహ్రు గారి పుట్టిన రోజు  వార్షికోత్సవంను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  మన చాచా  నెహ్రుగారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి .నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ.  అందుకే  అతని మీద  ప్రేమ తో  బాలల దినోత్సవంతో నెహ్రు గారి  పుట్టిన రోజు జరుపుకుంటారు.

 రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియు చాచా నెహ్రూ గారి కల  ద్వారా ప్రత్యక్షంగా  వాటిని నేర్పినట్టు  ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది.  బాలలదినోత్సవ శుభాకాంక్షలు .

సోమవారం, నవంబర్ 12, 2012

దీపావళి విధివిదానం మరియు శుభాకాంక్షలు

సోమవారం, నవంబర్ 12, 2012

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.

దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    
దీపావళి శుభాకాంక్షలు

నరకచాతుర్ది నరకవధ




నరకాసురుడు భూదేవి కుమారుడు శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు.  ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనామహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.   భూమాత ఎంత గొప్పదో కదా.  కొడుకు లోకకంతకుడు అని తెలిసి క్షమించకుండా మరణశిక్ష విధించింది.   
ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.  

ఆదివారం, నవంబర్ 11, 2012

శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.

ఆదివారం, నవంబర్ 11, 2012

శ్రీ మహాలక్ష్మి అమ్మ చూపులు ఎలా వుంటాయి అంటే దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయి. అవే చూపులు తన భక్తుల పైన  దీనులపై దయను కురిపిస్తాయి . దరిద్రమును దహించివేసి ఎంతో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట . 
ఓ మహాలక్ష్మి తల్లీ, అలాంటి నీ చల్లని చూపులతో నా దురదృష్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరుణ రస లహరి లో.
పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ
అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని
చరణము
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే
దీపావళి రోజు సముజ్వల దీపాలతోరణాల మధ్య శ్రీ వైభవలక్ష్మిని నిలుపుకొని భక్తి శ్రద్దలతో పూజించుకొనే రోజు . అసలు దీపమే లక్ష్మి. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే  అసలు రహస్యం. 
లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మిదేవికి కచ్చితమైన సేఫ్టీ లాకరుగా చెప్పవచ్చు .
లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా  అప్పుడు 
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే 
"అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
  • భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. 
  • శంఖద్వని వినిపించని చోటా. 
  • తులసిని పూజించని చోట.
  • శంఖరుని అర్చించని చోట.
  • బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.  లక్ష్మి దేవి నివసించదు. 
  • ఇల్లు కళ కళ లాడుతూ ఉండని  చోట.
  • ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
  • విష్ణువును ఆరాధించకుండ.
  • ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
  • హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. 
  • అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
  • చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. 
  • నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన  ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.  ఈరోజు ధనత్రయోదశి.  అందరకు ఇష్టమైన ధనలక్ష్మి కరుణ,  అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. 

దశావతారములో కృష్ణావతారము


దశావతారములో కృష్ణావతారము 

శుక్రవారం, నవంబర్ 09, 2012

దశావతారంలో రామావతారము

శుక్రవారం, నవంబర్ 09, 2012


దశావతారంలో రామావతారము

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)