శ్రీ మహాలక్ష్మి అమ్మ చూపులు ఎలా వుంటాయి అంటే దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయి. అవే చూపులు తన భక్తుల పైన దీనులపై దయను కురిపిస్తాయి . దరిద్రమును దహించివేసి ఎంతో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట .
ఓ మహాలక్ష్మి తల్లీ, అలాంటి నీ చల్లని చూపులతో నా దురదృష్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరుణ రస లహరి లో.
పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ
అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని
చరణము
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే
దీపావళి రోజు సముజ్వల దీపాలతోరణాల మధ్య శ్రీ వైభవలక్ష్మిని నిలుపుకొని భక్తి శ్రద్దలతో పూజించుకొనే రోజు . అసలు దీపమే లక్ష్మి. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే అసలు రహస్యం.
లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మిదేవికి కచ్చితమైన సేఫ్టీ లాకరుగా చెప్పవచ్చు .లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే
"అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
- భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు.
- శంఖద్వని వినిపించని చోటా.
- తులసిని పూజించని చోట.
- శంఖరుని అర్చించని చోట.
- బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
- ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.
- ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
- విష్ణువును ఆరాధించకుండ.
- ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
- హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
- అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
- చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
- నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. ఈరోజు ధనత్రయోదశి. అందరకు ఇష్టమైన ధనలక్ష్మి కరుణ, అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.