Blogger Widgets

శనివారం, అక్టోబర్ 11, 2008

లోక సహజం!

శనివారం, అక్టోబర్ 11, 2008

చందనతరుషు భుజంగా
జలేషు కమలాని తత్ర చ గ్రాహాః !
గుణఘాతినశ్చ భోగే
ఖలా న చ సుఖాన్యవిఘ్నాని !!
పరిమళం వెదజల్లే గంధంపు చెట్లలో పాములు ; కమలాలు ఉండే నీళ్ళలో మొసళ్ళు ; భోగాల్లో గుణహీనులైన నీచులు ఉండడం లోక సహజం. విఘ్నాలు లేకుండా సుఖాలు కలుగవు.


శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్......

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా...
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి . ఈ నోము వివాహమైన నవ వధువులు పదకొండు సవత్సరాలు చేసి వుధ్యాపన చేసుకోవాలి.
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

హల్లో ..........

హలో అన్దరూ బాగున్నారా. దసరా బాగాజరుపుకున్నారా. అందరికి విజయదసమి శుభాకాంక్షలు .

శుక్రవారం, అక్టోబర్ 03, 2008

భగవంతుని విలువ

శుక్రవారం, అక్టోబర్ 03, 2008

ఒక పెద్ద మనిషి తన వద్ద పని చేసే సేవకుని పిలిచి అతని చేతికి ఒక వజ్రం ఇచ్చి మార్కెట్లో దాని విలువ ఎంతో తెలుసుకొని రమ్మన్నాడు . సేవకుడు మొదట ఒక వంకాయల వ్యాపారి దగ్గరకు తీసునుకొనివెళ్ళాడు. ఆ వర్తకుడు దానిని కాస్సేపు పరీక్షించి "ఇది తొమ్మిది సేర్ల వంకాయల విలువ చెయ్యదు. అని తేల్చి చెప్పాడు.
సేవకుడు అక్కడ నుండి వస్త్రాల వ్యాపారి దగ్గరకు వెళ్లి అతనిని కుడా దాని విలువ కట్టమన్నాడు. ఆ వ్యాపారి రాయి మంచిదే కాని తొమ్మిది వందల రూపాయలు కంటే ఎక్కువ వుండదు . ఆ పైన ఒక్క రూపాయి అయినా దండగే అన్నాడు.
బంగారం వర్తకుని దగ్గర అడిగినా ఆ రాయి విలువ లక్ష రూపాయలు అన్నాడు. వజ్రాల వ్యాపారి ని అడగగా చూసి చూడగానే కోటి రుపాయులువుంటుది అన్నాడు.
ఈ వర్తకులు వారి వారి పెట్టుబడి స్థాయి ని బట్టి , గుణగ్రహణ శక్తిని బట్టి వజ్రం విలువను ఎలా నిర్ణయించారో అలాగే వ్యక్తులు కుడా తమ తమ గ్రహిపుసక్తిని బట్టి, సంస్కారాన్ని బట్టి భగవంతుడి విలువను నిర్ణయించ గలుగుతారంటారు రామ కృష్ణ పరమహంస.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)