Blogger Widgets

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్......

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా...
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి . ఈ నోము వివాహమైన నవ వధువులు పదకొండు సవత్సరాలు చేసి వుధ్యాపన చేసుకోవాలి.
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

5 కామెంట్‌లు:

  1. నేను విన్నాను అట్లతద్ది నోము గురించి. నేను చెయ్యలేదు కాని అందరు చేసుకొన్ పెట్టిన అట్లని మటుకు తిన్నాను. గోరింటాకు పెట్టుకొని, ఉయ్యాల ఊగే ఘట్టం నాకిష్టం.

    రిప్లయితొలగించండి
  2. వైష్ణవి గారు అట్లతద్ది గురించి చాలా బాగాచెప్పారమ్మా.అట్లతద్ది నోములో శాస్రీయ ద్రుక్పథం వుంది .నవగ్రహాలలో కుజునికి అట్లంటే ప్రీతి.అట్లను నేవేద్యం పెట్టటం వల్ల కుజదోషం తొలగునట . అట్లు లో మినప్పప్పు, బియ్యం వాడతారు మినుములు రాహువుకి, బియ్యం చంద్రుడికి సంబందించినవి . అంధువల్ల అట్లు వాయనం ఇవ్వటం వల్ల గర్బ ధొషాలు తొలగుతాయి.
    అంతేకాధు అట్లతద్ది రోజు ఆటలు, పాటలు తో చేసేనోము ఆట పాటలంటే గౌరీ దేవికి ఇష్టం . అంధువల్ల సరధాగా జరుపుకోవాలి .

    రిప్లయితొలగించండి
  3. హలో ! అండి. రేపేనండి ఆట్లతద్ది. నేను రాసిన అట్లతద్దోయ్ అనే వ్యాసం చదివే వుంటారు. దానికి రమణిగారి srk గారి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా బాగున్నయ్ కదండీ. అయితే srk గారు ఇంకా మంచి విషయాలు చెప్పారు .మీరూ తెలుసుకున్నరు కధా. రమణిగారికి , srk గారికి నా థేంక్స్ . అందరూ అట్లతద్ది నోము సరదాగా జరుపుకుంటారని అశిద్దం.

    రిప్లయితొలగించండి
  4. ఉయ్యాలలు అందరూ ఊగుతారు ఈ పండగ రోజయ్యితే
    గోరింటాకు ఇక కొత్తగా పెళ్లి అయ్యిన వాళ్ళు ఎంత నిష్ట గా చేస్తారా అని చూడటం
    ఆడడం గెంతడం ఇంకా వేడి వేడి అట్లు సాయంత్రం పూజలు భలే వుంటుంది లే
    కాకుంటే ఈ పండగ చేస్కోవాలంటే ఆనవాయితీ వుండాలటగ

    రిప్లయితొలగించండి
  5. విజయవంతమైన చిత్రం నిన్నే పెళ్లాడుతా లో అట్ల తద్ది గురించిన ప్రస్తావన ఉన్నది.అత్లతద్ది అంటే ఏమిటంటే అన్న ప్రశ్నకు అట్లతద్దే అన్న జవాబొచ్చును. ఈ అట్ల తద్ది నోమును నా శ్రీమతిని నోయమనగా, నోము మహత్యముతో నేను యవ్వనవంతుడినవుతే,ఏ కుర్రదాని వెంటో పోయి,తనని ఒగ్గేసే ప్రమాదముందని,భయపడిపోయెను.అత్లతద్ది చెయ్యజాల అంటూ మొండికేయుచున్నది. ఈమె చే ఈ అమోఘ వ్రతము చేయించుటెట్లో తోచకున్నది.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)