దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలా మందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలు చేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలో చాలామంది.
ఐతే మా అమ్మమ్మ పూర్వపు పద్దతు లు చెప్పింది అవి ఏమిటంటే :
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించే రోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములో నువ్వులనూనెతో తలంతుపోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్ని జలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట . నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆ లోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఆ తరువాత ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించిశ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,
సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే అని అమ్మమ్మ చెప్పింది. సరే అమ్మమ్మ చెప్పినవి దీపావళి రోజు పాటిస్తారు కధూ ! మరి నేను ఉంటా మరి బాయ్ ................................
.
శుక్రవారం, అక్టోబర్ 24, 2008
బుధవారం, అక్టోబర్ 22, 2008
జై జవాన్ ............జై కిసాన్...........!
అరే ! ఏమిటిది అనుకుంటున్నారా ? ఏమి లేదండి ఈ రోజు మనం అందరు గుర్తు పెట్టుకోవలసిన రోజు.
అయ్యో ఏమిటి ఆలోచిస్తున్నారు ? ఈ రోజు మనం హాయిగా తింటున్నాము అతను లేకపొతే మనకు చాలాకష్టం. ఎవరనుకుంటున్నారా? మీరు ఎక్కవ ఆలోచించవద్దు . అతను ఎవరోకాదు దుక్కు దున్నీ, నీరు పెట్టి , నారు నాటి, పంటలు పండించే రైతు.
ఈ రోజు" రైతు దినోత్సవం "
భారతీయ రైతులకు అగ్రనాయకులల్లో ఒకరైన శ్రీ చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం ను పురస్కరించుకొని ప్రతీ సవత్సరం అక్టోబర్ ఇరవైరెండున రైతు దినోత్సవం ను జరుపుకుంటున్నారు.
రైతులనేవారు సమాజానికి రైతు వెన్నెముక్కలాంటివారు . రైతు పండించే పంటలమీదే మొత్తం సమాజం అంతా ఆదారపడి వుంది అంటే మనం ఆశ్చర్య పడనక్కరలేదు. రకరకాలైన పంటలను పండించే రైతులు, రాత్రి లేదు, పగలు లేదు ,ఎండనకా, వాననకా కష్టపడతారు.
ఈ దేశానికైనా సామాజిక, ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ శాతం ఆధారిపడి వుంది. ఇంత కష్టపడే రైతుకు జీవన పరిస్థితి అంత బాగోలేదు . ఇది చాలా బాధాకరమైన విషయం.
ప్రభుత్వం వీరికి సరైన సహకారం అందిస్తే బాగుంటుంది . వారి కి వారి కుటుంబానికి విద్యకు, ఆరోగ్యానికి , ఆధునిక వ్యవసాయ పద్దతులు లో శిక్షణ ఇచ్చి విత్తనాలు , ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఇప్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విషయాలలో సరైన రేటు ఇవ్వాలి. ఈ వస్తువు కొన్న అమ్మినా రైతులు మోసపోకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. రైతు కస్టపడి పండిస్తే మధ్యలో దారాలు లాభం పొందుతున్నారు. ఇలాజరగకుండా చూడాలి.
రాష్ట్రంలో సగటున ఒక్కో రైతుకు ఉన్న భూమి.. 3 ఎకరాలు.
ఒకటింపావు ఎకరా కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు… 45.70 లక్షలు.
రెండున్నర ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు… 28.47 లక్షల మంది. ఐదెకరాల లోపు భూమి కలిగినవారు 26.39 లక్షల మంది.
50 ఎకరాలకు మించిన భూమి ఉన్నవారు… కేవలం 6920 మంది.
ఈ రకం గా వున్నా వారు అంత కాస్త పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేధు. రైతులకి తగిన కష్టఫలం దొరకకపోతే రైతుకి వ్యవసాయం మీద విరక్తి కలిగి వారు కుడా ఉద్యోగాలకోసం వెళ్ళిపోతున్నారు.
ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వారి అవసరాలు తీర్చి వారిని ఉత్సాహపరచి , వారిని సత్కరించాలి.
లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ .........జై కిసాన్ .........అన్నారు . ఇది నిజం దేశాన్ని బోర్డర్ దగ్గర వున్నా జవాను, బోర్డరు లోపల వున్నా కిసాను మనకి చాలా అవసరం. వారి విలువలు మనం కాపాడాలి . రైతే రాజు అన్న నానుడి నిజం చెయ్యాలి. విష్ యు హ్యాపీ కిసాన్ డే.
మంగళవారం, అక్టోబర్ 21, 2008
చందమామ రావే.................జాబిల్లి రావే..............
ఇప్పటిదాక్యా రాత్రి వేళ్ళ మనం భోజనం చెయ్యక మనం మారాం చేస్తే.............. మన అమ్మలు చందమామ రావే జాబిల్లి రావే ......... అనే పాటలు పాడుతూ మనలను మైమరిపించి మనకు భోజనం తినిపించేవారు. మీకుకూడా గుర్తు వుండేవుంటుంది. మనం ఈచంధమామ కధలు విన్నాం కదా. ఎన్నో కధలు ఎన్నెన్నో............... పూర్వం నుండి రాముని ధగ్గర నుండి చంద్రుడిగురించి వాళ్ళ అమ్మలు కధలు చెప్పడం మనకు కూడా మన అమ్మలు చెప్పారు కధండి. అయితే ఆ కధలే మనవారికి స్పూర్తి అయ్యింది. కాభోలు. ఆనాటి పిల్లలు చంద్రుడు దిగి వస్తాడు అన్కొని పెద్దయ్యాకా రాడని గ్రహించి అప్పటి ఆ చంద్రుడిని చేరాలన్న ఆశతో ప్రయత్నించి ఈనాటి కి ఆ ప్రయత్నాన్ని సఫలి కృతం చేసుకోబోతున్నాడు. ఇది నిజంగా సంతోషించవలసిన విషయం . రేపు చంద్రయ్యాన్ ప్రోయోగం చెయ్యబోతున్నారు .ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ చంధమామయ్య రాడు మనమే వెళ్ళాలి . బాగుంది కదా..
భారత దేశం చంద్రుడిపైకి ప్రయోగించనున్న తోలి మానవరహిత అంతరిక్షనౌక చంద్రయాన్ కౌంట్ డౌన్ పూర్తి కావస్తోంది . నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం ౬.౨౦ గంటలకు జరిగే ప్రయోగం సర్వం సిద్దం అయ్యింది.చంద్రుడికి వంద కిలోమీటర్ల కక్షలోకి చేరుకొనేందుకు చంద్రయాన్ భూమి చుట్టూ రెండు దసలల్లో బ్రమనాలు జరుపుతుంది. వచ్చెనేల ఎనిమిది వ తేదీకల్లా ఇది నిర్దిష్ట కక్షలోకి చేరుతుంది .చంద్రయాన్ ప్రయోగం కోసం భారతీయ శాత్రవేత్తలే కాకుండా విదేసియులు కుడా పాలుపంచుకున్నారు. చిత్రాలుతో చంద్రుడి ఉపరితలం కళ్ళకు కన్బదేటట్టు వుండతానికి దానికి కెమెరా కుడా వుంచారు.
ఈ ప్రయోగం వెనకాల చాలాకారనాలు కనబడుతున్నాయి.
భవిషత్తులో మనిషి అవసరాలు ను భూమి తీర్చలేని పరిస్థితి వస్తే.......... చంద్రుడి పై శాస్వత నివాసాలు ఏర్పరచుకోవచ్చు.
భూమి , సౌరకుటుంబం , విశ్వం , సంబంధించిన చరిత్ర ను ఆవిర్ చంద్రుడిపై ప్రయోగాలు వుపకరిస్తాయి. మనిషి నివసించే అవకాసం ఉందని అనుకుంటున్నా అంగారకుడి తో పాటు మిగతా గ్రహాలపైనా ప్రయోగించటానికి వీలుగా వుంటుంది.
భూమి నుండి చన్ధ్రుదుఇ మద్య దూరం మూడు లక్షల ఏనాబైనాలుగు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్లు.
చంద్రుడు భూమి తో పోలిస్తే నాలుగో వంతు ఉంటుంది.
భూమి నుండి చూస్తే చంద్రుడు ఒక వైపే కనిపిస్తుంది. రెండోవైపు తెలుసుకున్దురు.
ఒకే మరి రేపు జరిగే చంద్రయాన్ ప్రయోగం తో భారతీయ తివర్ణ పతాకం ను ఎగరవస్తారు. మన జెండా చంద్రుడిమీద సగర్వంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అది తలచుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. నాకు చాలా గర్వంగాకుడా వుంది.
ఈ చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.
శుక్రవారం, అక్టోబర్ 17, 2008
నొప్పించక తానొప్పక
"అమ్మా ! దరిద్ర లక్ష్మీ ! నీవు పోతున్నప్పుడు చాలా అందంగా వుతావంమా ".అన్నాడు.ఈ విధంగా యుక్తిగా ఇద్దరినీ తృప్తి పరచాడు. ప్రతీవారికి యుక్తి అవసరం . యుక్తి వలన శక్తీ సంపాదించవచ్చు. ఉపాయం తో అపాయాన్నుంది తప్పించుకోవచ్చు .