ఇప్పటిదాక్యా రాత్రి వేళ్ళ మనం భోజనం చెయ్యక మనం మారాం చేస్తే.............. మన అమ్మలు చందమామ రావే జాబిల్లి రావే ......... అనే పాటలు పాడుతూ మనలను మైమరిపించి మనకు భోజనం తినిపించేవారు. మీకుకూడా గుర్తు వుండేవుంటుంది. మనం ఈచంధమామ కధలు విన్నాం కదా. ఎన్నో కధలు ఎన్నెన్నో............... పూర్వం నుండి రాముని ధగ్గర నుండి చంద్రుడిగురించి వాళ్ళ అమ్మలు కధలు చెప్పడం మనకు కూడా మన అమ్మలు చెప్పారు కధండి. అయితే ఆ కధలే మనవారికి స్పూర్తి అయ్యింది. కాభోలు. ఆనాటి పిల్లలు చంద్రుడు దిగి వస్తాడు అన్కొని పెద్దయ్యాకా రాడని గ్రహించి అప్పటి ఆ చంద్రుడిని చేరాలన్న ఆశతో ప్రయత్నించి ఈనాటి కి ఆ ప్రయత్నాన్ని సఫలి కృతం చేసుకోబోతున్నాడు. ఇది నిజంగా సంతోషించవలసిన విషయం . రేపు చంద్రయ్యాన్ ప్రోయోగం చెయ్యబోతున్నారు .ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ చంధమామయ్య రాడు మనమే వెళ్ళాలి . బాగుంది కదా..
భారత దేశం చంద్రుడిపైకి ప్రయోగించనున్న తోలి మానవరహిత అంతరిక్షనౌక చంద్రయాన్ కౌంట్ డౌన్ పూర్తి కావస్తోంది . నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం ౬.౨౦ గంటలకు జరిగే ప్రయోగం సర్వం సిద్దం అయ్యింది.చంద్రుడికి వంద కిలోమీటర్ల కక్షలోకి చేరుకొనేందుకు చంద్రయాన్ భూమి చుట్టూ రెండు దసలల్లో బ్రమనాలు జరుపుతుంది. వచ్చెనేల ఎనిమిది వ తేదీకల్లా ఇది నిర్దిష్ట కక్షలోకి చేరుతుంది .చంద్రయాన్ ప్రయోగం కోసం భారతీయ శాత్రవేత్తలే కాకుండా విదేసియులు కుడా పాలుపంచుకున్నారు. చిత్రాలుతో చంద్రుడి ఉపరితలం కళ్ళకు కన్బదేటట్టు వుండతానికి దానికి కెమెరా కుడా వుంచారు.
ఈ ప్రయోగం వెనకాల చాలాకారనాలు కనబడుతున్నాయి.
భవిషత్తులో మనిషి అవసరాలు ను భూమి తీర్చలేని పరిస్థితి వస్తే.......... చంద్రుడి పై శాస్వత నివాసాలు ఏర్పరచుకోవచ్చు.
భూమి , సౌరకుటుంబం , విశ్వం , సంబంధించిన చరిత్ర ను ఆవిర్ చంద్రుడిపై ప్రయోగాలు వుపకరిస్తాయి. మనిషి నివసించే అవకాసం ఉందని అనుకుంటున్నా అంగారకుడి తో పాటు మిగతా గ్రహాలపైనా ప్రయోగించటానికి వీలుగా వుంటుంది.
భూమి నుండి చన్ధ్రుదుఇ మద్య దూరం మూడు లక్షల ఏనాబైనాలుగు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్లు.
చంద్రుడు భూమి తో పోలిస్తే నాలుగో వంతు ఉంటుంది.
భూమి నుండి చూస్తే చంద్రుడు ఒక వైపే కనిపిస్తుంది. రెండోవైపు తెలుసుకున్దురు.
ఒకే మరి రేపు జరిగే చంద్రయాన్ ప్రయోగం తో భారతీయ తివర్ణ పతాకం ను ఎగరవస్తారు. మన జెండా చంద్రుడిమీద సగర్వంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అది తలచుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. నాకు చాలా గర్వంగాకుడా వుంది.
ఈ చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.