మంగళవారం, నవంబర్ 10, 2009
ఆదివారం, నవంబర్ 01, 2009
మాతెలుగు తల్లి కి మల్లెపూదండ
ఆదివారం, నవంబర్ 01, 2009
ఈ రోజు ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.పొట్టిశ్రీరాములు (1901-1952) గాందేయుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టాఏర్పాటుకు 58 రోజులు ఉపవాస దీక్ష కొనసాగించి ఆత్మార్పణ చేసి అమరజీవిగా ప్రసిద్దుడైనాడు.
అతని అత్మార్పణ ఫలితంగా మనకు ఆంద్ర ప్రదేశ్ ఏర్పడింది.
ఆంద్ర రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు.
గురువారం, అక్టోబర్ 22, 2009
నాగుల చవితి
గురువారం, అక్టోబర్ 22, 2009
ఈరోజు నాగుల చవితి కదా నేను పుట్టలో పాలు పోసారు. అమ్మమ్మ చలిమిడి, చిమిలి చేసింది .నేను పుట్టలో పాలు చలిమిడి, చిమిలి వేసి పూజ చేసాము.
అమ్మమ్మ మాచేత
నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమో స్తుతే
అన్న శ్లోకం చెప్పించింది.
తరువాత మతాబులు , కాకరపువ్వొత్తులు , టపాసులు పేల్చాము.
పాముకు పాలు పోసేటప్పుడు అమ్మ నాచేత ఇలా చేప్పించింది.
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పించింది.
ఇది ఏమి టి అని అమ్మమ్మను అడిగితే ప్రకృతి ని పూజిచటం మన సంస్కృతి మనది.
మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.
పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము.
సోమవారం, అక్టోబర్ 19, 2009
బ్రహ్మకడిగిన పాదము
సోమవారం, అక్టోబర్ 19, 2009
పాట: బ్రహ్మ కడిగిన పాదము
రచన: తాళ్ళపాక అన్నమాచార్యులవారు
రాగం: ముఖారి
తాళం: ఆదితాళము
బ్రహ్మ కడిగిన పాదము
రాగం: ముఖారి
తాళం: ఆదితాళము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము 11
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలిత మొపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము 11
కామినిపాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసత్ పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము 11
పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీపాదము
తిరువేంకటగిరి తిరమన చూపిన
పరమపదము నీ పాదము 11
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)