చిన్ని కృష్ణుని గురించి ఎంత చెప్పినా వినాలనె వుంటుంది మరి పాటలు అయితే ఇంకా అందంగా వుంటాయి. చిన్నికృష్ణుని పాటలు చాలాబాగుంటాయి. చిన్నికృష్ణుని అల్లరి పనులును యశోదామాతకు గోపికలు వర్ణిస్తున్నారు ఆ పాట నాకు చాలా నచ్చుతుంది.చిన్ని కృష్ణుని అల్లరి కి వారు విసిగి యశోదామాతకు వారి కృష్ణునివల్ల కలిగిన బాధలు చెప్తారు. అప్పుడు వారి మాటలకు యశోదామాత మాకృష్ణుడు చిన్నవాడు అల్లరి చేయలేడు అని అంటుంది. అప్పుడు వారు విడిచి వెల్దాంమంటారు. వినండి చాలాబాగుంది.
శ్రీరామనవమిశుభాకాంక్షలు. శ్రీరాముడురోజునజన్మించిన మరో మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము. సీతారాములకల్యాణంమహోత్సవం , శ్రీరామచంద్రమూర్తిరావణునివధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీరామునిపట్టాభిషేకముజరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .
ధశరధునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది. రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.