శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
శ్రీ రాముడు రోజున జన్మించిన మరో మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము. సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .
శ్రీ రామనామ మంత్రం:
దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో
తాత్పర్యము:
ధశరధునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.