సోమవారం, జులై 26, 2010
జూలై 22 వ తేదిన మన జాతీయ జండాకు భారతరాజ్యాంగ సభలో ఆమోదం లభించింది. మనదేశంలో త్రివర్ణపతాకము జాతీయజండాగా రూపొందింది. మనత్రివర్ణపతాకములో కాషాయంరంగు, తెలుపు రంగు, ఆకుపచ్చరంగు సమానమైనంగా వుంటాయి. జెండా మద్యలో తెలుపురంగుకు మద్యలో 24 రెక్కలు కలిగిన నీలంరంగు ధర్మచక్రంవుంటుంది. జెండా పొడవు వెడల్పులు 2:3 గా వుంటుంది. మనజాతీయ జండా రూపకర్త పింగళి వెంకయ్య గారుఖాదీ బట్టతో తయారు చేసారు.
మనజేండాలో మూడు రంగులుకు మూడు ప్రత్యేక అర్దాలున్నాయి.
మొదటిది కాషాయరంగు-త్యాగానికి గుర్తు.
రెండవదు తెలుపు రంగు-సత్యానికి గుర్తు.
మూడవది ఆకుపచ్చరంగు-పాడి పంటలకు గుర్తు.
అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం. చక్రంలో 24 రేకలు వుంటాయి.వాటికి కూడా ఒక్కొక్కదానికి ఒక్కక్కొ భావం వుంది.
1. ప్రేమ
2. దయ
3. జాలి
4. కరుణ
5. సహనం
6. దైర్యం
7. శాంతి
8. మంచి
9. నమ్మకం
10. సున్నితస్వభావం
11.సంయమనం
12. త్యాగనిరతి
13.ఆత్మార్పణ
14. నిజాయితీ
15. సచ్ఛీలత
16. న్యాయం
17. హుందాతనం
18. వినమ్రత
19. దివ్యజ్ఞానం
20. ఈశ్వర జ్ఞానం
21.దైవనీతి
22. దైవభక్తి
23. దైవంపై ఆశ
24.విశ్వాసం
ఈ 24 రేకలు మనభారతదేశ ప్రగతి కారకాలు. ఇన్ని ఉద్దేశాలతో ఏర్పడిన మనజాతీయ జెండాకు ఆమోదం కలిగినరోజు గుర్తు చేసుకుంటున్నందుకు నేను చాలాసంతోషిస్తున్నాను.
ఆదివారం, జులై 25, 2010
మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యా
సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా ll
ఆవులు పేయలకుగా నరచీ బిదుకవలె
గోవిందుడ యింక మేలుకోవయ్యా
ఆవలీవలపడుచు లాటలు మరిగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా ll
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ
గూడియున్నారిదే మేలుకోవయ్యా
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము
యీడకు దెచ్చి పెట్టె నిక మేలుకోవయ్యా ll
పిలిచీ నందగోపుడు పేరుకొని యదె కన్ను
గొలుకులు విచ్చి మేలుకోవయ్యా
గొలుకులు విచ్చి మేలుకోవయ్యా
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్యా ll
ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
ఈరోజు గురుపూర్ణిమ. వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము. ఈరోజు గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు. గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు. ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||
విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు మంచి చెప్పే ప్రతీవారు గురువులే. ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి. ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ