బుధవారం, డిసెంబర్ 15, 2010
తిరుప్పావై అంటే ౩౦ రోజుల పూజ అని అర్ధం అయ్యింది కదా ! మరి ఆ పూజ ఎలా చెయ్యాలో తెలుసుకుందామనుకున్నాం కదా అయితే అది తెలుసుకునే ముందు తిరుప్పావై అంటే ఏమిటో తెలుసుకుందాం .
తిరుప్పావై అంటే శ్రీ వ్రతం. శ్రీ అంటే సంపద కదా. అన్ని సంపదలను ఇచ్చే నూము కదా, దీని నే ధనుర్మాస వ్రతం అని కుడా అంటారు ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూరీడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి. ఈనెల రోజులు పూజలు చేయటం భగవంతునికి మనం చేరువు కావటానికి ఈ వ్రతం ఒక మార్గం ఏలా అంటే మార్గ శిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవగీత లో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసం లో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వృక్షచాయ. ఇది గ్రీష్మఋతువులో చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమగు మార్గశీర్ష మాసంకుడా, అతిశీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిచినచో మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుస్తోమ్ది . మార్గ శిరం సత్వ గుణము ను పెంచి భగవదనుభుతిని కలుగ చేస్తుంది.
లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం . మార్గశిర్శమో ! క్షేత్రములో సస్యములు పంది భారంతో వంగి మనోహరంగా ఉంటుంది.
అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషముగా వుందురు. ఈ నెల ప్రారంభం నుండిఇళ్ళల్లొ ఆడవారు మార్గశిర లక్ష్మి వారపూజలు ప్రత్యెకంగా లక్ష్మివారం రోజు చేయటం ప్రారంభించి పుష్యమాసం మొధటి లక్ష్మి వారం వరకు చాలానియమ నిస్టలతో పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మేహ్రుదయకమలం ముగ్గు పెట్టి లక్ష్మి ని ఆహ్వానించి పూజచెస్తారు. ఈమెని కనక మహాలక్ష్మి గా కొలుస్తారు .
చంద్ర మానాన్ని బట్టి మార్గశిరమని , సూర్య మానాన్ని బట్టి ధనుర్మాసమని ఏర్పడ్డయి . ఈ రెండూ ఒకటె.
ఈ మాసంలొ తెల్లవారుజామున లెచి మార్గశిర స్నానాలు చేసి తమలో వున్న ఙ్ నాన్ని మెలుకొల్పుదురు. ఆద్యాతంక చింతన కలిగి వుంధురు .
ఇక మార్గశిర మాసంలొ ఒక రహస్యమున్నది. మార్గముని నిర్ధెశించునధి. అని అర్ధము. భగవానుని పొంధు దారి అన్న మాట.
మంగళవారం, డిసెంబర్ 14, 2010
ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాశమ్ వచ్చింది దనుర్మాశమ్ కూడా మొదలు కాబోతుంది. అది ఎంతో విశేషమైన వైకుమ్ఠఏకాదశి రోజు ప్రారంభమవుతోంది. ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవే పాడిన ౩౦పాసురాలును పాడతారు ఇది చాలా విశేషమైననెల.
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన
ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజు లు రోజుకు ఒక పాశురమ్ చదువుతారు .
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమ నిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగానుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది. అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మ కు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.
నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః అని పరాసుర భట్టరు వారు కీర్తించారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .
మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి. తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది. మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం. ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి. నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.
సోమవారం, డిసెంబర్ 13, 2010
పల్లవి:
చల్లని చూపులవాని చక్కనివాని పీలి
చొల్లెపుం జుట్లవానిఁ జూపరమ్మ చెలులు
చరణం:
వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయును దానై యెలయించె నన్నును |వాని
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు
చరణం:
మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలులు
చరణం:
ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే వాడు
దంటవాడు కలికి చేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుండై నన్ను గూడెనే | వాని |
వొంటి బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.
శనివారం, డిసెంబర్ 04, 2010
ఈరోజు పరశురాముడు జయంతి.
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు. తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది. పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒక అవతారం.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ