ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాశమ్ వచ్చింది దనుర్మాశమ్ కూడా మొదలు కాబోతుంది. అది ఎంతో విశేషమైన వైకుమ్ఠఏకాదశి రోజు ప్రారంభమవుతోంది. ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవే పాడిన ౩౦పాసురాలును పాడతారు ఇది చాలా విశేషమైననెల.
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన
ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజు లు రోజుకు ఒక పాశురమ్ చదువుతారు .
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమ నిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగానుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది. అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మ కు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.
నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః అని పరాసుర భట్టరు వారు కీర్తించారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .
మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి. తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది. మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం. ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి. నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.
మంగళవారం, డిసెంబర్ 14, 2010
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
Jai Srimanna:r:yana!!
రిప్లయితొలగించండిDasohams to Bhagavadbandhus.
Dhanurma:sam is approaching soon(16th Dec). Dhanurma:sam is well known for taking Deeksha. Every season has its own importance. In certain season crops grow very fast than some other season. That’s why formers choose particular season to cultivation. A student chooses early time in the morning for his studies. In a similar way our elders have chosen this time for dedicating our acts for God so that we achieve the best out of short effort. Vedas says athma’s (soul’s) ultimate goal is God whom we call parama:thma, Param-Brhama, Krishna etc.
In thretha: yuga Bharatha performed prayers in Dhanurma:sam. In Dwa:para yuga Go:pikas performed prayers in Dhanurma:sam. In Kali yuga Goda de:vi performed prayers in Dhanurma:sam. Let’s practice Dhanurma:sam with ultimate joy with the pravachanams of Sri Sri Sri Tridandi Chinna Srimanna:ra:yana Ramanuja Jeeyar Swamiji.
http://www.pravachana4u.info/
Adiyen
Ramanujadasa