Blogger Widgets

గురువారం, డిసెంబర్ 16, 2010

ముక్కోటి ఏకాదశి /గీతాజయంతి

గురువారం, డిసెంబర్ 16, 2010

సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి  సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు   ఈరోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకువుంటాయని. వైష్ణవ గుళ్ళుదగ్గర ఉత్తరంవైపు వున్నద్వారం వైపునుండి భక్తులు భగవంతుని దర్శిస్తారు.  ఈరోజున ముక్కోటి దేవతలు భూమికి వచ్చి ఉత్తరద్వారం వైపునుండి స్వామిని ధర్శిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారుట. 


 ఈరోజునే పాలసముద్రం నుండి విషం మరియు అమృతం పుట్టాయి.  ఈరోజే  పరమ శివుడు విషం మింగాడు.   ఈరోజు చాలా మంది ఉపవాశం వుంటారు. 
ఈరోజునే గీతాజయంతి కూడా అందుకే చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు.  
మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీత.  గీతలో మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ: 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అని ధృతరాష్ట్రుడు అనగా ఈ గీతను సంజయుడు ధృతరాష్ట్రుడికి  వివరించాడు ఆరోజే గీత జయంతిగా చెప్తతారు.  భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయిమ్ది. పోయిమ్దేదో పోయిమ్ది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు.
కారు లేదని చింతించకు _ కాలువున్నందుకు సంతోషించు.
కొట్లులేవని చింతించకు _ కూటికి వున్నదికడా ! సంతోషించు . అది లేక చాలామంది భాద పడుతున్నారు .
కాలిలో ముళ్ళు కుచ్చుకున్నదని చింతించకు _ కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు .
కాలం చాలావిలువైనది _రేపు అను దానికి రుపులేదు. మంచి పనులను వాయిదావేయవద్దు.
అసూయను రుపుమాపు_ అహంకారాన్ని అనగద్రోక్కు .
హింసను విడనాడు_అహింసను పాటించు .కొపాన్న్ని దరి చేర్చకు _ఆవెశముతో ఆలోచించకు
ఉపకారం చేయకపోయినా _అపకారం తలపెట్టకు.
మతిని శుద్దము చేసేధి మతం_ మానవత్వంలెని మతం మతం కాధు.
దేవుని పూజించు_ ప్రాణికోట్లకు సహకరించు.
తద్వారా భగవదాశీర్వాధం తో శాంతి నీవెంటె వుంటుంధి అని అన్నరు. ఇదే గీతాసారం 

తిరుప్పావై మొదటి పాశురం


ఈ రోజు నుండి ధనుర్మాసం ప్ర్రారంభమము అయ్యింది కదండి. మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలు ను గోదాదేవి ఈ వ్రతం చేయుటకు చేయుటకుముందుగా వారు మార్గశిరమాసం గురించి వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేసారో దాని వల్ల కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  మొదటి పాశురం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 .
మరి ఈ పాశురం తాత్పర్యము ఏమిటంటే  ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము

బుధవారం, డిసెంబర్ 15, 2010

మార్గశిరమాసం వ్రత విశిష్ఠత

బుధవారం, డిసెంబర్ 15, 2010

తిరుప్పావై అంటే ౩౦ రోజుల పూజ అని అర్ధం అయ్యింది కదా ! మరి ఆ పూజ ఎలా చెయ్యాలో తెలుసుకుందామనుకున్నాం కదా అయితే అది తెలుసుకునే ముందు తిరుప్పావై అంటే ఏమిటో తెలుసుకుందాం .  

తిరుప్పావై అంటే శ్రీ వ్రతం.  శ్రీ అంటే సంపద కదా. అన్ని సంపదలను ఇచ్చే నూము కదా,  దీని నే ధనుర్మాస వ్రతం అని కుడా అంటారు  ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూరీడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.  ఈనెల రోజులు పూజలు చేయటం భగవంతునికి మనం చేరువు కావటానికి ఈ వ్రతం ఒక మార్గం  ఏలా అంటే మార్గ శిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవగీత లో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసం లో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వృక్షచాయ. ఇది గ్రీష్మఋతువులో చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమగు మార్గశీర్ష మాసంకుడా, అతిశీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిచినచో మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుస్తోమ్ది  . మార్గ శిరం సత్వ గుణము ను పెంచి భగవదనుభుతిని కలుగ చేస్తుంది.
లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం . మార్గశిర్శమో ! క్షేత్రములో సస్యములు పంది భారంతో వంగి మనోహరంగా ఉంటుంది.
అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషముగా వుందురు. ఈ నెల ప్రారంభం నుండిఇళ్ళల్లొ ఆడవారు మార్గశిర లక్ష్మి వారపూజలు ప్రత్యెకంగా లక్ష్మివారం రోజు చేయటం ప్రారంభించి పుష్యమాసం మొధటి లక్ష్మి వారం వరకు చాలానియమ నిస్టలతో పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మేహ్రుదయకమలం ముగ్గు పెట్టి లక్ష్మి ని ఆహ్వానించి పూజచెస్తారు. ఈమెని కనక మహాలక్ష్మి గా కొలుస్తారు .
చంద్ర మానాన్ని బట్టి మార్గశిరమని , సూర్య మానాన్ని బట్టి ధనుర్మాసమని ఏర్పడ్డయి . ఈ రెండూ ఒకటె.
ఈ మాసంలొ తెల్లవారుజామున లెచి మార్గశిర స్నానాలు చేసి తమలో వున్న ఙ్ నాన్ని మెలుకొల్పుదురు. ఆద్యాతంక చింతన కలిగి వుంధురు .
ఇక మార్గశిర మాసంలొ ఒక రహస్యమున్నది. మార్గముని నిర్ధెశించునధి. అని అర్ధము. భగవానుని పొంధు దారి అన్న మాట.

మంగళవారం, డిసెంబర్ 14, 2010

ధనుర్మాసం వస్తోంది

మంగళవారం, డిసెంబర్ 14, 2010

ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాశమ్ వచ్చింది దనుర్మాశమ్ కూడా మొదలు కాబోతుంది. అది ఎంతో విశేషమైన వైకుమ్ఠఏకాదశి రోజు ప్రారంభమవుతోంది.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవే పాడిన ౩౦పాసురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల.

అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన
ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజు లు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు .
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమ నిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగానుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మ కు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       అని పరాసుర భట్టరు వారు కీర్తించారు.

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)