Blogger Widgets

గురువారం, డిసెంబర్ 23, 2010

తిరుప్పావై 8 పాశురం

గురువారం, డిసెంబర్ 23, 2010

ఈ ధనుర్మాస వ్రతము చాలా విలక్షణమైన వ్రతము . ఈ వ్రతము వల్ల మన శరీరము మంచి అలవాట్లు నేర్చుకొనుటకు బాగా దోహదపడుతుందని అర్దమవుతుంది.
గోపికను లేపుటకు కీచు కీచు మని పక్షుల అరుపులు వినలేదా ? రేపల్లె గోపికలు తరచూ పెరుగు తరచుట నిత్యకృత్యములు . వారు పున్యస్త్రీలే . వారు
 తెల్లవారుజామున లేచి తలడువ్వుకొని పూలు ముడుచు కొని శ్రీ కృష్ణుని పాటలు పాడుతూ పెరుగు చిలుకుతారు. అప్పుడు పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దము ఆకాశానికి వ్యాపించే టంత ఎక్కువ వస్తుంది. అయితే వారు చిలుకుతున్నప్పుడు వారి మెడలో వున్న నగలు శబ్దములు కూడా వస్తున్నాయి కదా అవి నీకు వినబదటం లేదా ఓనాయకురాలా నీవు మిక్కిలి తెజస్సు కలదానివి . నీ తెజస్సు మాకు కనబడుతున్నది,తలుపు తెరువు నీ తెజస్సు చుచి మేము అనందించునట్లు చెయి. అని లేపారు.
ఇంతవరకు మేల్కొలినన పిల్లలిద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడచుచుండగా నిద్రపోతున్న మరో గోపికను లేపుటకు బయలుదేరారు.ఆండాళ్ తల్లి మనిషి లక్ష్యం ఏమిటి ? వాటిని చేరుటకు ఏమిచేయ్యలని వారికి వేదాలలోని సారాన్ని తిరుప్పావై రూపములో వివరించింది. ఆ వివరణలోమైత్రేయి సహిత కాత్యాయిని యాజ్నవల్క్య మహర్షి గురించి
 వివరించింది. ఆమె మెట్ట వేదాంతమ్ వివరించలేదు. ఆమె మార్గమద్యలో ఏదిమమ్చిదొ ఏది చెడ్డదో అనుభవద్యులయిన పెద్ద వాళ్ల సలహాతీసుకొని ముందుకు సాగాలని వారికి ఏ ఋషి గురించి చెప్పింది. శ్రీ కృష్ణుని పొందుటకు తొందరగా లేచిరమ్మని మరో గోపికను లేపుతున్నారు.

పాశురం :
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు 
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
 

తాత్పర్యము:

తూర్పు తెల్లవారుతున్నది . చిన్న బీడులోనికి మేయుతకు విదువబడిన గేదెలు విచ్చలచీడిగా పోవుచున్నవి. మిగిన్లిన పిల్లందరును గుడా వ్రతస్తలమునకు పోవుటకు బయలుదేరి, అట్లు పోటమే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోయేవారిని మేము ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలచినాము . కుతూహలము కలదానా !ఓ పడతీ! లేచి రా.  కృష్ణుని గుణములు కీర్థించి వ్రతమున కుపకృమించి ప్రతసాధనమగు పరను పొంది, కేసి యను రాక్షసుని చీల్చి చంపినవానిని , మల్లురను మట్టుపట్టిన వానిని, దేవతలకు ఆది దేవుడైన వానిని మనము పోయి సేవించినచో అయ్యో! అయ్యో! మీరే వచ్చితిరే! అని భాదపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది

బుధవారం, డిసెంబర్ 22, 2010

తిరుప్పావై 7 పాశురం

బుధవారం, డిసెంబర్ 22, 2010

భగవద్విషయము విలక్షనమైనది . దానిని క్రొత్తగా అనుభవించువారును , చాలా కాలముగా అనుభవించినవారును . కుడా తన్మయులయి ఉందురు. భగవదనుభవము నిత్య నూతనముగా మోహపరచును మరియు అదే మొదటి అనుభావమువలె ఉండును. నిన్న మేల్కొల్పిన గోపికకు భగవదనుభవము క్రొత్త. మరి ఈ రోజు మేల్కొల్పుతున్న గోపిక భగవదనుభవము పరిచితమే . అయినా ఈ గోపిక మత్తెక్కి లేవక పురున్నది. ఈ ఏడో రోజున ఈమెని లేపుతున్నారు . బయట వున్నా శబ్దములు ను నిన్న ఉత్తిష్ఠ వినలేదు .
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు. ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు .నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు. ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా. ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ. అని అడిగిరి.దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము . ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది. మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము ,రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము, మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా. ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు . గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.
వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గురుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి . అందుచే పక్షులు శబ్దములు, శంఖనాధము , హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు. పక్షులు శ్రీ గురు మూర్తులు , అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు. శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.




కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:

భరద్వాజపక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారు జామున కలసికొని అన్ని వైపులా ఏ వేవొ మాటలు మాటలాడుకొనుచున్నాయి ఆ మాటాలలో ధ్వనిని నీవు వినలేదా?.
ఓ పిచ్చిదానా ! కుసుమాలకృతములగు కేశబంధము లు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులూగల గోపికలు, కవ్వముతో పెరుగు చిలుకుతున్నప్పుడు, వారి చేతుల కంకణ ద్వనులు, మెడ లోని ఆభరణధ్వనులతోకలసి , విజౄభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనులు లినలేదా. ఓ నాయకురాలా! సర్వ పదార్ధములలో వాత్సలముతో వ్యాపించియుండి , మనకు కనపడాలని శ్రీ కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుండగా వినుటలేదా, లేక వినీ పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నధి . దానిని ఆపకుండా మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువవా.?
అని పలువిదాలుగా ఈ గోపికను నిద్ర లేపుచున్నారు.

మంగళవారం, డిసెంబర్ 21, 2010

తిరుప్పావై 6 పాశురం

మంగళవారం, డిసెంబర్ 21, 2010

ఇంతవరకు ఈ వ్రతమునకు రంగము సిద్దమైనది. గోదాదేవి మిగిలిన గోపికలును ఈ వ్రతమునకు రావలసినదిగా ఆహ్వానించింది. ఈ వ్రతము ముఖ్య వుద్దేసము భగవంతుని అనుగ్రహము పొందాలని . ఊరివారి దృష్టిలో వర్షాలు పడాలని . ఈ వ్రతము నాచరించుటకు భాగవత్స్తమాగము పొందాలన్న కోరిక కలవారు అందరూ అర్హులే అని గోదామాత మొదటి రోజున చెప్పినది.
వ్రతసమయము లో చేయవలసిన కృత్యాలు ను రెండవ రోజు న వివరించింది.
ఈ వ్రతము సమయమున వారి వారి కోరికలు నేరవారతాయని మూడవ రోజున వివరించింది .
ఈ వ్రతము చేయునపుడు ఇతర దేవతలు అందరూ విదేయులై ఆఙను నెరవేర్చును అని నాల్గవ రోజు వివరించింది .
భగవదనుభావం పొందుటకు ఆటంకము లను కలిగిన భగవన్నామ స్మరణము చే ఆటంకాలు తోలగునని ఐదవ రోజు వివరించింది.
ఇక నుండి వ్రతమునకు ఉపక్రమించు ముందుగా పది రోజులు పదిమంది గోపికలను మేల్కొల్పి వారందరితో కలసి వ్రతమునకు సాగుతున్నారు.
ఈ వ్రతము చేయుటకు గోపికలందరూ అత్యుత్సాహము తో వున్నారు. కొందరు అస్సలు నిద్రపోకుండా మెలకువగా వున్నారు . కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.

ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది.

పాశురము :
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
భగవదనుభావము క్రోత్తదవుట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కత్తె తన ఇంటి లో పడుకొని బయటకు రాకుండా వున్న ఒక అమ్మాయిని లేపుచున్నారు.
ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కలకలాడుచున్నవి . ఆ పక్షులుకు నాయకుడైన గరుత్మంతునకు స్వామీ యగు శ్రీ మహా విష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయము అయినది అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ద్వని వినుటలేదా ! ఓ పిల్లా ! లే!. మేము ఎవరు లేపగా లేచామన్న అనో కలుగవచ్చు .పుతన స్తనములందుండు విషమునారగించినవాడును . అసిరావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి యగునట్లు చేసినవాడును, క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షచింతనతో యొగనిద్ర సమరియున్న జగత్కారణభుతుడగు ఆ సర్వెస్వరుని తమ హృదయముల పదిలపరచుక్ని మెల్లగా లేచ్చున్న మునులును యోగులను హరి -హరి -హరి అనుచున్నప్పుడు వెల్లిన పెద్ద శబ్ధము మా హృదయములలో చొచ్చి, చల్లబరచి , మమ్ములను మేల్కొల్పినది. నీవునూ లేచి రా .

అందరూ కలసి ఈ వ్రతము చేద్దమను కొని కలసి వెళ్ళి యమునా స్నానాలు చేసి ఈ వ్రతము చెయ్యాలను కున్నారు. దాని కి గాను అందరి నీ తెల్లవారుజామున నిద్రలేపుచున్నారు. వారి లో ముందుగా ఉత్తిష్టను లేపుచున్నారు.

ఆదివారం, డిసెంబర్ 19, 2010

తిరుప్పావై 5 పాశురం

ఆదివారం, డిసెంబర్ 19, 2010

మన గోపికలు అందరు మన ఆండాళ్ గోపిక పిలుపు వినిఆమెని అనుసరించి ఒక చోట చేరారు . వారిలో కొందరు వేదాలు తెలిసినవారు . మరి కొందరు పురాణాలు తెలిసినవారు. మరి కొందరు నాట్య కళ తెలిసినవారు. . మరి కొందరు సంగీతము తెలిసినవారు. మరి కొంతమంది కి ధర్మ శాస్త్రము తెలుసు. అందులో కొంతమందికి చాలా డౌట్లు వచ్చాయి. వారు అంటారు. మనము జ్ఞానము లేనివారం కదా? మనము తెలిసి తెలియక చాలా పాపాలు చేసే వుంటాము కదా? మరి ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా ఎన్నో జన్మలనుమ్ది సంపాదించిన పాపాలు వుంటాయి కదా. మనకు మన పాపాలు తోలగానిదే మనకు కృష్ణ భాగవానిని కృప కలుగుతుందా. అని ప్రశ్నిం చుకొన్నారు .
ఒక్కొక్క గోపిక ఒక్కొక రకముగా మాట్లాడుతున్నారు.
మరి శాస్త్రము తెలిసిన గోపిక : "నిజమే మనము చేసిన పాపములు మనము అనుబవిమ్చినా తీరవు. ఈ పాపాలు తీరంది పరమాత్మను చేరలేము. లేక ఒక ఉపాయమున్నది మన పాపాలకు మనమే ప్రాయశ్చిత్తము చేసుకున్నా మనము పరమాత్మ వద్దకు చేరచ్చు. చాలా మంది ఋషులు తపస్సు లు పూజలు చేసి ఫలము అండలేక పోయారు. అందుకే " శ్రేయాంసి బహువిఘ్నాని " అని అన్నారు. కావున మన పాపాలు పోవుటకు మన గోదాచేప్పిన వ్రతమును అనుసరించుదాము.
పురాణాలు తెలిసిన మరో గోపిక రామాయణము గురించి వివరించింది . స్వయముగా భగవంతుడే కష్టాలు పడినాడు . మన లాంటివారికి మరి పాపాలు తొలగి వ్రతము సాగునా అని ప్రశ్నిం చింది .
లోకములో దైవము మానవ రూపమున శిష్ట రక్షణకు అనుభవించవలసి వచ్చినది. ఇది కేవలము దైవ లీలమాత్రమే.
ఈ వ్రతము వల్ల నిస్సంకోచముగా మన పాపాలు తొలగును . వేదంతము తెలిసిన గోపిక : మనము చేయు కర్మలు 2 అవి పుణ్యాలు , పాపాలు . పుణ్యము సుఖాన్ని , పాపము దుఖాన్ని ఇస్తాయి. మనము చేసే పుణ్యాలు పరమాత్మకు దగ్గరకు చేరుస్తాయి . వెనువెంటనే మన పాపాలు పోతాయి.
దూది పింజ నిప్పు తగిలినవెంతనే ఎలా బూడిద అవుతుందో అలాగే మన పాపాలు భగవంతుని దరి చేరగానే నసించుతాయి అని చెప్పింది. కావున ఈ వ్రతము మనకు మంచేచేయును అని వ్రతానికి ఉపక్రమించారు మన గోపికలు.
ఈ తిరుప్పావై లో గోదామాత వేదాల సారాన్ని వివరించింది.


మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము : ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.

మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి . 1 అహింస , 2 ఇంద్రియనిగ్రహము ,
౩ సర్వభూతదయ , 4 క్షమా , 5 జ్ఞానము , 6 తపస్సు , 7 సత్యము , 8 ధ్యానము
ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)