భగవద్విషయము విలక్షనమైనది . దానిని క్రొత్తగా అనుభవించువారును , చాలా కాలముగా అనుభవించినవారును . కుడా తన్మయులయి ఉందురు. భగవదనుభవము నిత్య నూతనముగా మోహపరచును మరియు అదే మొదటి అనుభావమువలె ఉండును. నిన్న మేల్కొల్పిన గోపికకు భగవదనుభవము క్రొత్త. మరి ఈ రోజు మేల్కొల్పుతున్న గోపిక భగవదనుభవము పరిచితమే . అయినా ఈ గోపిక మత్తెక్కి లేవక పురున్నది. ఈ ఏడో రోజున ఈమెని లేపుతున్నారు . బయట వున్నా శబ్దములు ను నిన్న ఉత్తిష్ఠ వినలేదు .
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు. ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు .నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు. ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా. ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ. అని అడిగిరి.దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము . ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది. మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము ,రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము, మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా. ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు . గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.
వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గురుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి . అందుచే పక్షులు శబ్దములు, శంఖనాధము , హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు. పక్షులు శ్రీ గురు మూర్తులు , అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు. శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
భరద్వాజపక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారు జామున కలసికొని అన్ని వైపులా ఏ వేవొ మాటలు మాటలాడుకొనుచున్నాయి ఆ మాటాలలో ధ్వనిని నీవు వినలేదా?.
ఓ పిచ్చిదానా ! కుసుమాలకృతములగు కేశబంధము లు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులూగల గోపికలు, కవ్వముతో పెరుగు చిలుకుతున్నప్పుడు, వారి చేతుల కంకణ ద్వనులు, మెడ లోని ఆభరణధ్వనులతోకలసి , విజౄభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనులు లినలేదా. ఓ నాయకురాలా! సర్వ పదార్ధములలో వాత్సలముతో వ్యాపించియుండి , మనకు కనపడాలని శ్రీ కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుండగా వినుటలేదా, లేక వినీ పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నధి . దానిని ఆపకుండా మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువవా.?
అని పలువిదాలుగా ఈ గోపికను నిద్ర లేపుచున్నారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.