ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు . ముదడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారి ని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.
అటువంటి ప్రేమ మనకు కావాలికదా, అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వరుఉపము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.
ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది . అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు మేల్కొల్పబదుచున్నధి.
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తెమూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటార 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఎదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంభందాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విదముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.
ఈ ధనుర్మాస వ్రతము చాలా విలక్షణమైన వ్రతము . ఈ వ్రతము వల్ల మన శరీరము మంచి అలవాట్లు నేర్చుకొనుటకు బాగా దోహదపడుతుందని అర్దమవుతుంది.
గోపికను లేపుటకు కీచు కీచు మని పక్షుల అరుపులు వినలేదా ? రేపల్లె గోపికలు తరచూ పెరుగు తరచుట నిత్యకృత్యములు . వారు పున్యస్త్రీలే . వారు తెల్లవారుజామున లేచి తలడువ్వుకొని పూలు ముడుచు కొని శ్రీ కృష్ణుని పాటలు పాడుతూ పెరుగు చిలుకుతారు. అప్పుడు పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దము ఆకాశానికి వ్యాపించే టంత ఎక్కువ వస్తుంది. అయితే వారు చిలుకుతున్నప్పుడు వారి మెడలో వున్న నగలు శబ్దములు కూడా వస్తున్నాయి కదా అవి నీకు వినబదటం లేదా ఓనాయకురాలా నీవు మిక్కిలి తెజస్సు కలదానివి . నీ తెజస్సు మాకు కనబడుతున్నది,తలుపు తెరువు నీ తెజస్సు చుచి మేము అనందించునట్లు చెయి. అని లేపారు.
ఇంతవరకు మేల్కొలినన పిల్లలిద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడచుచుండగా నిద్రపోతున్న మరో గోపికను లేపుటకు బయలుదేరారు.ఆండాళ్ తల్లి మనిషి లక్ష్యం ఏమిటి ? వాటిని చేరుటకు ఏమిచేయ్యలని వారికి వేదాలలోని సారాన్ని తిరుప్పావై రూపములో వివరించింది. ఆ వివరణలోమైత్రేయి సహిత కాత్యాయిని యాజ్నవల్క్య మహర్షి గురించి వివరించింది. ఆమె మెట్ట వేదాంతమ్ వివరించలేదు. ఆమె మార్గమద్యలో ఏదిమమ్చిదొ ఏది చెడ్డదో అనుభవద్యులయిన పెద్ద వాళ్ల సలహాతీసుకొని ముందుకు సాగాలని వారికి ఏ ఋషి గురించి చెప్పింది. శ్రీ కృష్ణుని పొందుటకు తొందరగా లేచిరమ్మని మరో గోపికను లేపుతున్నారు. పాశురం : కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్ తాత్పర్యము:
తూర్పు తెల్లవారుతున్నది . చిన్న బీడులోనికి మేయుతకు విదువబడిన గేదెలు విచ్చలచీడిగా పోవుచున్నవి. మిగిన్లిన పిల్లందరును గుడా వ్రతస్తలమునకు పోవుటకు బయలుదేరి, అట్లు పోటమే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోయేవారిని మేము ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలచినాము . కుతూహలము కలదానా !ఓ పడతీ! లేచి రా. కృష్ణుని గుణములు కీర్థించి వ్రతమున కుపకృమించి ప్రతసాధనమగు పరను పొంది, కేసి యను రాక్షసుని చీల్చి చంపినవానిని , మల్లురను మట్టుపట్టిన వానిని, దేవతలకు ఆది దేవుడైన వానిని మనము పోయి సేవించినచో అయ్యో! అయ్యో! మీరే వచ్చితిరే! అని భాదపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది
భగవద్విషయము విలక్షనమైనది . దానిని క్రొత్తగా అనుభవించువారును , చాలా కాలముగా అనుభవించినవారును . కుడా తన్మయులయి ఉందురు. భగవదనుభవము నిత్య నూతనముగా మోహపరచును మరియు అదే మొదటి అనుభావమువలె ఉండును. నిన్న మేల్కొల్పిన గోపికకు భగవదనుభవము క్రొత్త. మరి ఈ రోజు మేల్కొల్పుతున్న గోపిక భగవదనుభవము పరిచితమే . అయినా ఈ గోపిక మత్తెక్కి లేవక పురున్నది. ఈ ఏడో రోజున ఈమెని లేపుతున్నారు . బయట వున్నా శబ్దములు ను నిన్న ఉత్తిష్ఠ వినలేదు .
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు. ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు .నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు. ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా. ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ. అని అడిగిరి.దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము . ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది. మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము ,రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము, మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా. ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు . గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.
వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గురుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి . అందుచే పక్షులు శబ్దములు, శంఖనాధము , హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు. పక్షులు శ్రీ గురు మూర్తులు , అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు. శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.
తాత్పర్యము: భరద్వాజపక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారు జామున కలసికొని అన్ని వైపులా ఏ వేవొ మాటలు మాటలాడుకొనుచున్నాయి ఆ మాటాలలో ధ్వనిని నీవు వినలేదా?.
ఓ పిచ్చిదానా ! కుసుమాలకృతములగు కేశబంధము లు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులూగల గోపికలు, కవ్వముతో పెరుగు చిలుకుతున్నప్పుడు, వారి చేతుల కంకణ ద్వనులు, మెడ లోని ఆభరణధ్వనులతోకలసి , విజౄభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనులు లినలేదా. ఓ నాయకురాలా! సర్వ పదార్ధములలో వాత్సలముతో వ్యాపించియుండి , మనకు కనపడాలని శ్రీ కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుండగా వినుటలేదా, లేక వినీ పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నధి . దానిని ఆపకుండా మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువవా.?
అని పలువిదాలుగా ఈ గోపికను నిద్ర లేపుచున్నారు.
ఇంతవరకు ఈ వ్రతమునకు రంగము సిద్దమైనది. గోదాదేవి మిగిలిన గోపికలును ఈ వ్రతమునకు రావలసినదిగా ఆహ్వానించింది. ఈ వ్రతము ముఖ్య వుద్దేసము భగవంతుని అనుగ్రహము పొందాలని . ఊరివారి దృష్టిలో వర్షాలు పడాలని . ఈ వ్రతము నాచరించుటకు భాగవత్స్తమాగము పొందాలన్న కోరిక కలవారు అందరూ అర్హులే అని గోదామాత మొదటి రోజున చెప్పినది.
వ్రతసమయము లో చేయవలసిన కృత్యాలు ను రెండవ రోజు న వివరించింది.
ఈ వ్రతము సమయమున వారి వారి కోరికలు నేరవారతాయని మూడవ రోజున వివరించింది .
ఈ వ్రతము చేయునపుడు ఇతర దేవతలు అందరూ విదేయులై ఆఙను నెరవేర్చును అని నాల్గవ రోజు వివరించింది .
భగవదనుభావం పొందుటకు ఆటంకము లను కలిగిన భగవన్నామ స్మరణము చే ఆటంకాలు తోలగునని ఐదవ రోజు వివరించింది.
ఇక నుండి వ్రతమునకు ఉపక్రమించు ముందుగా పది రోజులు పదిమంది గోపికలను మేల్కొల్పి వారందరితో కలసి వ్రతమునకు సాగుతున్నారు.
ఈ వ్రతము చేయుటకు గోపికలందరూ అత్యుత్సాహము తో వున్నారు. కొందరు అస్సలు నిద్రపోకుండా మెలకువగా వున్నారు . కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది.
తాత్పర్యము: భగవదనుభావము క్రోత్తదవుట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కత్తె తన ఇంటి లో పడుకొని బయటకు రాకుండా వున్న ఒక అమ్మాయిని లేపుచున్నారు.
ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కలకలాడుచున్నవి . ఆ పక్షులుకు నాయకుడైన గరుత్మంతునకు స్వామీ యగు శ్రీ మహా విష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయము అయినది అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ద్వని వినుటలేదా ! ఓ పిల్లా ! లే!. మేము ఎవరు లేపగా లేచామన్న అనో కలుగవచ్చు .పుతన స్తనములందుండు విషమునారగించినవాడును . అసిరావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి యగునట్లు చేసినవాడును, క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షచింతనతో యొగనిద్ర సమరియున్న జగత్కారణభుతుడగు ఆ సర్వెస్వరుని తమ హృదయముల పదిలపరచుక్ని మెల్లగా లేచ్చున్న మునులును యోగులను హరి -హరి -హరి అనుచున్నప్పుడు వెల్లిన పెద్ద శబ్ధము మా హృదయములలో చొచ్చి, చల్లబరచి , మమ్ములను మేల్కొల్పినది. నీవునూ లేచి రా .
అందరూ కలసి ఈ వ్రతము చేద్దమను కొని కలసి వెళ్ళి యమునా స్నానాలు చేసి ఈ వ్రతము చెయ్యాలను కున్నారు. దాని కి గాను అందరి నీ తెల్లవారుజామున నిద్రలేపుచున్నారు. వారి లో ముందుగా ఉత్తిష్టను లేపుచున్నారు.