Blogger Widgets

శనివారం, నవంబర్ 12, 2011

Sree Krishna Game

శనివారం, నవంబర్ 12, 2011

గురువారం, నవంబర్ 10, 2011

చందమామ రావో

గురువారం, నవంబర్ 10, 2011

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥


నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥

తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥

సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

ఆదివారం, నవంబర్ 06, 2011

క్షీరాబ్ది ద్వాదశి

ఆదివారం, నవంబర్ 06, 2011

తులసి దామోదరుడు 
కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.

దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మనులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
ఈ క్షీరాబ్ది ద్వాదశినే కైశిక ద్వాదశి అని కూడా అంటారు. 

ఈ ద్వాదశి మీద అన్నమాచార్యులు వారు ఈ పాటను రచించారు .
దినమో ద్వాదశి.

దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల బాడ 
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుడు నీవు
                                                                                    నంకెల మాయీంటి విందు లారగించవే

అబ్బురంపు శిశువు


అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోలు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

పుట్టు శంఖు చక్రముల బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిసువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

నిండిన బండి తన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేశసురుల గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి


వెగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని ఆ శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెనుబాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)