అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోలు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
పుట్టు శంఖు చక్రముల బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిసువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
నిండిన బండి తన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేశసురుల గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
వెగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని ఆ శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెనుబాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.