శనివారం, నవంబర్ 19, 2011
|
వీర నారి ఝాన్సి లక్ష్మిబాయ్ & ఆమె దత్త పుత్రుడు దామోదర్ |
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమెను అందరు మనూ అని ముద్దుగా పిలిచేవారు. ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదా య బ్రాహ్మణ కుటుంబం. ఝాన్సీ లక్ష్మీబాయికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలో పెరిగింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆయన తెలియజేసారు. పరాస్నిస్ ఝాన్సి రాణీగారి జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి ఆమె పుట్టిన దినముకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన నవంబర్ 19 ,1828 తేదీని అమోదించవలిసి వుంది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె వయసు 26 ఏళ్ళ స్త్రీ .
ఆమె తల్లి చనిపోయిన తరువాత బాజీరావు పీష్వా, మోరోపంత్‌ను బీరూర్‌కి పిలిచి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవటంతో నానాసాహెబ్ అనే బాలుడిని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ ను మన మనూ నానా అన్నయా అని ఎంతో ప్రేమగా పిలిచేది. నానా కూడా మనూను చెల్లెలిగా ఆదరించారు మరియు అన్ని విషయాలలో సహాయంగా వున్నాడు నానా. వీరు విద్యలన్నీ కలిసి నేర్చుకున్నారు. కత్తిసాము, గురప్రు స్వారీ, తుపాకీ పేల్చటం వంటి విద్యలంటే మనూకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనూబాయి దూసుకొని పోయేది.
లక్ష్మీబాయికి 13వ ఏటనే 1842లో ఝాన్సీ రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. మహారాణి అయిన తర్వాత అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పేరు లక్ష్మీ బాయి అయింది. 1851లో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు నాలుగు నెలలకే బ్రిటిష్ వారి కుట్ర తో చనిపోయాడు.వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాదార్ మరణించాడు.
దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం దామోదర్‌రావు రాజు కావాల్సి ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. లక్ష్మి బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ సలహా తో లండన్ కోర్టులో దావా వేసింది.కోర్టులో ఎంత వాదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. బ్రిటిష్ వారు లో ముఖ్యడు నిల్సన్ అనే అతను కుట్రచేసి లక్ష్మి బాయి పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. దానికి మోసపూరితంగా ఝాన్సి లోకి ప్రవేసించి వారు ఝాన్సి రాజ్యాన్ని ఆదినపచుకున్నారు. 1857లో జరిగిన తిరుగుబాటులో ఝాన్సీ పట్టణం లో విప్లవానికి నాంది పలికింది. విప్లవకారులకు కేంద్రం అయింది. ఆ సమయంలోనే ఆమె సైన్యాన్ని సమీకరించి ఆత్మరక్షణ చేసుకుంది. మహిళలకు కూడా యుద్దవిద్యలు నేర్పించినది. ఆమె పురుషవేషం తో తన దత్త పుత్రుని వీపుకు కట్టుకొని పక్క రాజ్యాలైన దతీయా, ఓర్చాల దాడిని ఎదుర్కొంది. వారిని కూడా తన విప్లవములోపాలుపంచుకోనేటట్టు చేసి చివరకు బ్రిటిష్ సైన్యం పై ఝాన్సీ ముట్టడించింది. రెండు వారాలు పోరాడి ఆఖరికి 1858, జూన్ 17న గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది ఝాన్సి లక్ష్మి బాయి.
|
ఆమె ఆనాడు మొదలు పెట్టిన విప్లవ జ్యోతి పెద్దగా మారి చివరకు మనదేశం నుండి విదేశీయులు వదిలి వెళ్ళేవరకు ఆగలేదు.
నిజంగా ఆమెకు head
's off చెప్పాలి.
శుక్రవారం, నవంబర్ 18, 2011
|
HAPPY BIRTHDAY TO MICKEY MOUSE
|
హాయ్ ! ప్రపంచంలో ఉన్నపిల్లలందరు గుర్తుపెట్టుకుంటున్న కారక్టర్ MICKEY MOUSE . ఈరోజు MICKEY MOUSE BIRTHDAY. అని అందరుకు తెలుసు.మిక్కి మౌస్ అన్నది అమెరికాలోని animal cartoon character ,Mickey Mouse అన్నది Walt Disney అనే కంపనీ నుండి 1928 వ సంవత్సరం లో తయారు చేయబడింది. ప్రతీ సంవత్సరం నవంబర్ 18th న మిక్కి మౌస్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పిల్లలకి రాముడు తెలియక పోవొచ్చేమో కానీ మిక్కి మౌస్ తెలియని వారుండరు. Mickey Mouse Club లీడర్ మన MICKEY నే.
మిక్కి మౌస్ మొట్టమొదట " plane crazy " అని May 15 న 1928 లో stage program ఇచ్చారు. దీనిలో మిక్కీ తన సొంత ఇంట్లో తయారుచేసే విమానం తను హీరో, చార్లెస్ Lindberg, మరియు వూ మిన్నీసమానమవటానికి చాలా ప్రయత్నిస్తుంది. దీనిని తయారు చేసినవారు Walt Disney , UbIwerks
డబ్బింగ్ చెప్పినవారిలో ముఖ్యులు Walt Disney (1928-1947), Jemmy MacDonald (1947-77),Wayne Allwine (1977-2009), Bret Iwan(2009) వంటి వారు చాలా కష్టపడి మనకోసం తయారు చేసారు. మన children 's day celebrations జరుపుకుంటున్నాం ఆ మధ్యలోనే మన ఇష్టమైన MICKEY Mouse Birth Day celebration జరుపుకోవటం నాకు చాలా సంతోషం గా వుంది. మరి మీకు? సరే
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన cartoon character MICKEY MOUSE BIRTHDAY ,
కావునా నాతో పాటు మీరు కూడా wishes చెప్పండి మరి.
బుధవారం, నవంబర్ 16, 2011
"వీడేనమ్మ కృష్ణమ్మా వేణువు ఊదే కృష్ణమ్మా
ఆవులు కాసే కృష్ణమ్మా వీడే ముద్దుల కృష్ణమ్మా
కాళ్ళ గజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి
మేడలో దండలు చూడండి తలలో పించము చూడండి
చదువులనిచ్చేకృష్ణమ్మా సంపదలునిచ్చే కృష్ణమ్మా
పాపల కాచే కృష్ణమ్మా బాలబందుడీ కృష్ణమ్మ
వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు ఊదే కృష్ణమ్మ!"
ఆదివారం, నవంబర్ 13, 2011
పిల్లల కు ఒక రోజు వుంది. ఆ రోజు పిల్లలకు ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తముగా బాలల దినోత్సవం ను ప్రతి సంవత్సరం నవంబర్ 20 న జరుపుకుంటారు.
పండితుడు జవహర్ లాల్ నెహ్రూ - నవంబర్ 14 న పురాణ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించినారు. నెహ్రు గారి పుట్టిన రోజు వార్షికోత్సవంను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన చాచా నెహ్రుగారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి .నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ. అందుకే అతని మీద ప్రేమ తో బాలల దినోత్సవంతో నెహ్రు గారి పుట్టిన రోజు జరుపుకుంటారు.
ఈ రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియు చాచా నెహ్రూ గారి కల ద్వారా ప్రత్యక్షంగా వాటిని నేర్పినట్టు ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది.
ఈ రోజు మేము అందరం ఫాన్సీ డ్రస్ షో లో పాల్గొంటాం. ఆదతాం, పాడతాం, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. మేము ఎప్పుడు ఎప్పుడు బాలల దినోత్సవం వస్తుందని ఎదురు చూస్తాము. బాలల దినోత్సవం మేము బాగా జరుపుకుంటాము. మంచిగా మా టీచర్స్ ఇచ్చే బహుమతులు అందుకుంటాము.
నా స్నేహితులకు అందరికి "Happy Children 's Day " .
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ