శనివారం, నవంబర్ 19, 2011
|
వీర నారి ఝాన్సి లక్ష్మిబాయ్ & ఆమె దత్త పుత్రుడు దామోదర్ |
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమెను అందరు మనూ అని ముద్దుగా పిలిచేవారు. ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదా య బ్రాహ్మణ కుటుంబం. ఝాన్సీ లక్ష్మీబాయికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలో పెరిగింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆయన తెలియజేసారు. పరాస్నిస్ ఝాన్సి రాణీగారి జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి ఆమె పుట్టిన దినముకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన నవంబర్ 19 ,1828 తేదీని అమోదించవలిసి వుంది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె వయసు 26 ఏళ్ళ స్త్రీ .
ఆమె తల్లి చనిపోయిన తరువాత బాజీరావు పీష్వా, మోరోపంత్‌ను బీరూర్‌కి పిలిచి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవటంతో నానాసాహెబ్ అనే బాలుడిని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ ను మన మనూ నానా అన్నయా అని ఎంతో ప్రేమగా పిలిచేది. నానా కూడా మనూను చెల్లెలిగా ఆదరించారు మరియు అన్ని విషయాలలో సహాయంగా వున్నాడు నానా. వీరు విద్యలన్నీ కలిసి నేర్చుకున్నారు. కత్తిసాము, గురప్రు స్వారీ, తుపాకీ పేల్చటం వంటి విద్యలంటే మనూకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనూబాయి దూసుకొని పోయేది.
లక్ష్మీబాయికి 13వ ఏటనే 1842లో ఝాన్సీ రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. మహారాణి అయిన తర్వాత అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పేరు లక్ష్మీ బాయి అయింది. 1851లో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు నాలుగు నెలలకే బ్రిటిష్ వారి కుట్ర తో చనిపోయాడు.వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాదార్ మరణించాడు.
దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం దామోదర్‌రావు రాజు కావాల్సి ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. లక్ష్మి బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ సలహా తో లండన్ కోర్టులో దావా వేసింది.కోర్టులో ఎంత వాదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. బ్రిటిష్ వారు లో ముఖ్యడు నిల్సన్ అనే అతను కుట్రచేసి లక్ష్మి బాయి పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. దానికి మోసపూరితంగా ఝాన్సి లోకి ప్రవేసించి వారు ఝాన్సి రాజ్యాన్ని ఆదినపచుకున్నారు. 1857లో జరిగిన తిరుగుబాటులో ఝాన్సీ పట్టణం లో విప్లవానికి నాంది పలికింది. విప్లవకారులకు కేంద్రం అయింది. ఆ సమయంలోనే ఆమె సైన్యాన్ని సమీకరించి ఆత్మరక్షణ చేసుకుంది. మహిళలకు కూడా యుద్దవిద్యలు నేర్పించినది. ఆమె పురుషవేషం తో తన దత్త పుత్రుని వీపుకు కట్టుకొని పక్క రాజ్యాలైన దతీయా, ఓర్చాల దాడిని ఎదుర్కొంది. వారిని కూడా తన విప్లవములోపాలుపంచుకోనేటట్టు చేసి చివరకు బ్రిటిష్ సైన్యం పై ఝాన్సీ ముట్టడించింది. రెండు వారాలు పోరాడి ఆఖరికి 1858, జూన్ 17న గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది ఝాన్సి లక్ష్మి బాయి.
|
ఆమె ఆనాడు మొదలు పెట్టిన విప్లవ జ్యోతి పెద్దగా మారి చివరకు మనదేశం నుండి విదేశీయులు వదిలి వెళ్ళేవరకు ఆగలేదు.
నిజంగా ఆమెకు head
's off చెప్పాలి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
చక్కటి విషయాన్ని తెలియజేసిన చిరంజీవి శతాయుష్మాన్ భవ
రిప్లయితొలగించండిchranjeeva sukheebhava
రిప్లయితొలగించండిధన్యవాదములు రాజశేఖర శర్మ గారు &కింగ్స్ గారు.
రిప్లయితొలగించండి