గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతము నకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు . వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు. మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
పాశురము
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్ ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్
విశేషార్ధము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు. ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి, సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు. చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు. సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు ఏఱి:
గర్జించి మిన్నంది. ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి. మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె.
"బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె. ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును. ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి. పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే. కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె మెరవాలిట. శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :
శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.
జై శ్రీమన్నారాయణ్