ఝాన్సీ లక్ష్మిబాయ్ జీ-తెలుగు సీరియల్ లోని టైటిల్ పాట నాకు బాగా నచ్చినది. చాలా inspirational song . ఆ సీరియల్ చూస్తూ వుంటే నాకు కళ్ళు చమరస్తున్నాయి. పాటలో కూడా అంతే పవర్ ఉంది. మీరు కూడా వినండి.
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది. ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ? లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను. బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును. లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను. బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా ! లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో . లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ? బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము. లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
ఇప్పుడే అందిన వార్త రష్యన్ కోర్టు పరీక్షలో గెలిచినా మన భగవానుడు శ్రీ కృష్ణులవారు చెప్పిన భగవద్గీత.
భగవద్గీత అనువాదంపై రష్యా కోర్టు నిషేధం విధిస్తుందా? కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటుందా? అనేక రకాల doubts తో మన దేశంలోనూ వారు విదేశాలలో వున్నా మన బారతీయులు టెన్షన్లో వున్నారు. ఇప్పుడే ఆ టెన్షన్ నుండి విముక్తి లభించింది. రష్యన్ కోర్ట్‌లో భగవద్గీతలో తీవ్రవాద భావజాలం ఉందంటూ. రష్యాకు చెందిన ఓ సంస్థ అక్కడి కోర్ట్‌ను ఆశ్రయించింది.
దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుదితీర్పును విడుదల చేసింది. ఆ కేసును రష్యన్ కోర్టు కొట్టివేసింది. మన గీతను రక్షించింది. భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఒత్తిడి తేవాలని కోరినా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా మనకు న్యాయమే జరిగింది. చివరికి శ్రీ కృష్ణ తత్వము గెలిచింది. ఇది చాలా సంతోషంగా వుంది నాకు, మీకు కూడా సంతోషంగా వుంటుంది అనుకుంటున్నాను. ఇందుకు గాను నా తరపునా, నా మిత్రులతరుపునా, నా బ్లాగ్ మిత్రుల తరుపునా, బ్లాగ్ ద్వారా రష్యన్ కోర్టుకు అభినందన పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది ఆ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
తాత్పర్యము: స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు. ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది. ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న గుడుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము. లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము. నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము. ఓ మాతనేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.