Blogger Widgets

గురువారం, డిసెంబర్ 29, 2011

ఉరిమై ఉరిమెను పిడుగై సాగెను

గురువారం, డిసెంబర్ 29, 2011

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

తెల్లవారిపై నల్లత్రాచులా బుసలుకొట్టెను ఝాన్సీరాణి
నల్లమనసుల తెల్ల మనుషుల భరతంపట్టే ఝాన్సీరాణి
మీపాలిట యమదూతగమారి పాశంవిసెరెను లక్ష్మిబాయి
సాగదురాఇక మీపెత్తనము తప్పదురా మీ తిరుగుప్రయాణము

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

ఆత్మగౌరవము వెల్లువలాగా పెల్లుబికిన ఈఝాన్సీరాణి 
దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసుర మర్ధినిలాగ  
ఆటకట్టునీ ఆటకట్టునీ నీకపటాలన్ని కట్టిపెట్టు 
ఆంగ్లేయుడా ముటలుకట్టు నయవంచకుడా పయనంకట్టు

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

దుర్గాదేవి ఝాన్సీరాణి వీరనారి ఈనారీమణి 
నీపాలిట మృత్యువురా పారిపోండిరా ఆంగ్లేయులు 
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు 
నల్లమనసుల తెల్లమనుషులు   

వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను వీరనారి ఝన్సీరాణి 
ఆటకట్టు నీఆటకట్టు ఇకఆంగ్లేయుడా మూటకట్టు
వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి 

ఝాన్సీ లక్ష్మిబాయ్ జీ-తెలుగు సీరియల్ లోని టైటిల్ పాట నాకు  బాగా నచ్చినది. చాలా inspirational song .  ఆ సీరియల్ చూస్తూ వుంటే నాకు కళ్ళు చమరస్తున్నాయి.  పాటలో కూడా అంతే పవర్ ఉంది.    మీరు కూడా వినండి. 
Thank  you . 

తిరుప్పావై పంచదస పాశురము

ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
పాశురము:
  ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో  
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
జై శ్రీ మన్నారాయణ్ 

బుధవారం, డిసెంబర్ 28, 2011

కోర్టున గెలిచినా గీత

బుధవారం, డిసెంబర్ 28, 2011

కోర్టున గెలిచినా గీత
ఇప్పుడే అందిన వార్త రష్యన్ కోర్టు పరీక్షలో గెలిచినా మన భగవానుడు  శ్రీ కృష్ణులవారు చెప్పిన భగవద్గీత.

భగవద్గీత అనువాదంపై రష్యా కోర్టు నిషేధం విధిస్తుందా? కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటుందా? అనేక రకాల doubts తో మన దేశంలోనూ వారు విదేశాలలో వున్నా మన బారతీయులు టెన్షన్లో వున్నారు.  ఇప్పుడే ఆ టెన్షన్ నుండి విముక్తి లభించింది. రష్యన్  కోర్ట్‌లో భగవద్గీతలో తీవ్రవాద భావజాలం ఉందంటూ. రష్యాకు చెందిన ఓ సంస్థ అక్కడి కోర్ట్‌ను ఆశ్రయించింది. 

దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుదితీర్పును  విడుదల చేసింది.  ఆ కేసును రష్యన్ కోర్టు కొట్టివేసింది.  మన గీతను రక్షించింది.  
భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఒత్తిడి తేవాలని కోరినా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా మనకు న్యాయమే జరిగింది. చివరికి శ్రీ కృష్ణ తత్వము గెలిచింది. ఇది చాలా సంతోషంగా వుంది నాకు, మీకు కూడా సంతోషంగా వుంటుంది అనుకుంటున్నాను.
ఇందుకు గాను నా తరపునా, నా మిత్రులతరుపునా, నా బ్లాగ్ మిత్రుల తరుపునా, బ్లాగ్ ద్వారా రష్యన్ కోర్టుకు అభినందన పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.  
                           జై శ్రీమన్నారాయణ్ 

తిరుప్పావై చతుర్దస పాశురము


ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది  ఆ గోపిక ఈనాడు  మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే  మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .


పాశురము:


ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:  స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు.  ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది.  ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న  గుడుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము.  లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము.  నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము.  ఓ మాతనేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.
జై శ్రీమన్నారయణ్  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)