Blogger Widgets

శుక్రవారం, జనవరి 06, 2012

తిరుప్పావై త్రివింశతి పాశురము

శుక్రవారం, జనవరి 06, 2012

అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరివిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
పాశురము:
  మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం 
మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

జైపూర్ ఫూట్ సృష్టి


కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ 1927లో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత పొందిన సేథీకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసా పత్రం అందజేశారు. 1981లో సామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది. పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు, దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పి.కె.సేథీ 2008, జనవరి 7న జైపూర్ లో మరణించారు.  కాళ్ళు కోల్పోయిన ఎందరికో కృత్రిమ కాళ్ళు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపినారు.
జైపూర్ ఫుట్ ఆలోచన ఎలావచ్చిందంటే ఎముకల వైద్య నిపుణుడైన  ప్రమోద్ కరణ్ సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే రామచంద్రారావు గారికే ఆలోచన వచ్చింది . ఒకనాడు అతడు సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందనీ, అప్పుడు అతడికి హటాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే ప్రచారం ఉంది.
ఈ జైపూర్ ఫుట్ పెట్టుకొన్న ఎంతోమంది కాళ్ళు లేని వారికి జీవితమీద ఆసక్తి పెరిగి వారిలో ఆత్మవిశ్వాసం కలిగింది. 
మీకందరికీ ఇలాంటి పోస్ట్ లు ఎందుకు పెడుతున్నాను అంటే నా చిన్నవయసులో నన్ను స్కూల్ కి తీసుకుని వెళ్ళే రిక్షా తొక్కే మనిషి అతని పేరు రాముడు అనుకుంటాను. అతనికి ఒకనాడు అనుకోకుండా ఆక్సిడెంట్ అయ్యింది అప్పుడు ఆతను తన రెండు కాళ్ళను పోగొట్టుకొన్నాడు.  వాళ్ళ ఇంటికి అతనే జీవనాదారం అతని భార్య కష్టపడి సంపాదించి ఇంటిని నడిపేది.  అతను ఏమనుకున్నాడో ఏమో జీవితంమీద విరక్తి చెంది ఉరివేసుకొని చనిపోయాడు.  అతనికి కాళ్ళు లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి మరణించి వుంటాడు.  ఇలాంటి జైపూర్ ఫుట్ వుంటే జీవింఛి వుండేవాడు.  అలా తెలియక చాలామంది వుంటారు. అందుకే అలాంటివారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.  నాకు ఈవిషయం చెప్తుంటే నాకు కళ్ళు చేమర్చుతున్నాయి. 
కాళ్ళు లేనివారికి ప్రమోద్ కరణ్ సేథీ దేవుడే.  ఆయన మరణించినా కూడా జైపూర్ ఫుట్ ద్వారా జీవించి ఉన్నట్టే.  ప్రమోద్ గారు ఒక ధ్రువ తారగా నిలిచివున్నారు.

జననము                       -  1927 న
మరణము                      -  2008, జనవరి 7న జైపూర్ లో 
మాతృస్థానము                     -  వారణాసి  
జాతీయత                            - భారతీయుడు
మాతృదేశము                     -భారతదేశము  
రంగము                             -ఎముకల వైద్యులు
గిన్నేస్స్ రికార్డు 
ముఖ్య పురస్కారాలు          -మెగ్సేసే అవార్డు,పద్మశ్రీ


ఎందరో మహానుభావులు అందరికీ వందనములు


ఎందరో మహానుభావులు అందరికీ వందనములు  అన్న పాటకు కర్త, కర్మ, క్రియ, త్యాగరాజు అని అందరికీ తెలుసు కదా.  అయితే  త్యాగరాజు (మే 4, 1767 1 - జనవరి 6, 18472) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తారు.  
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వారిలో ఒక్కరు త్యాగయ్యగారు.

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు 
రాగం: శ్రీ
తాళం: ఆది
గాయకుడు: Dr . మంగళంపల్లి బాలమురళీకృష్ణ

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున 
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య 
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే 
వారెందరో మహానుభావులు 

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి 
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును 
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు 
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున 
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో 
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే 
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని 
సదా కనుల జూచుచును పులక శరీరులై 
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము 
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన 
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు 
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు 
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము 
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను 
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను 
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను 
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి 
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు 
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను 
శివాది సన్మతముల గూఢములన్ 
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి 
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి 
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన 
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు 
రామభక్తుడైన త్యాగరాజనుతుని 
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

గురువారం, జనవరి 05, 2012

తిరుప్పావై ద్వివింశతి పాశురము

గురువారం, జనవరి 05, 2012

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
పాసురము:
  అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన 
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్

ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.





My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)