Blogger Widgets

సోమవారం, జనవరి 23, 2012

Ballero

సోమవారం, జనవరి 23, 2012

Check inside the game for instructions on how to play Ballero

నేతాజీ సుభాష్ చంద్రబోస్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈనాటి రోజు జన్మించారు  జనవరి 23, 1897. నేతాజీగా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.  ఒకవైపునుండి  గాంధీ  మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తు వుండగా.  సుభాష్ చంద్రబోస్ వంటి వారు హింసాయుధ పోరాటం వల్ల మాత్రమే స్వాతంత్రము పొందగలమని బలంగా నమ్మారు.  హింసాయుధము తోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది పూర్తిగా ఆచరణలో పెట్టిన గొప్ప మహనీయుడు.  
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. చాలా సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.  బోసు రాజకీయ అభిప్రాయాలుజర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయికొందరు వీటిని విమర్శిస్తేమరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారుఅతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికిఅతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.  ఇలాంటి గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు ను గుర్తు చేసుకొని మన దేశం మీద భక్తి పెంచుకోవాలని తలచాను.  

ఆదివారం, జనవరి 22, 2012

Why This Kolaveri Di Tom and Jerry Style

ఆదివారం, జనవరి 22, 2012

Why This Kolaveri Di 

విక్టోరియా రాణి

Queen Victoria
బ్రిటన్‌ రాణి విక్టోరియాఇంగ్లండుకు చెందిన మహారాణి 
1858 నుండి 1947 మధ్య భారత దేశము లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుందిబ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న పాలనను 1858లో విక్టోరియా రాణి కిరీటాని ధరించిన తరువాత 1876లో ఈమెను భారత దేశపు సామ్రాఙ్ఞిగా ప్రకటించారు, అప్పుడు ఈమె పాలనా వ్యవస్థను సంస్థాగతం చేయబడిందిబ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 1947 వరకూ కొనసాగింది.  ఈమె జీవించి ఉన్నంత కాలము భారత దేశాన్ని పరిపాలించినది.
విక్టోరియా పూర్తిపేరు అలెగ్జాండ్రినా విక్టోరియా.  ఈమె 24 మే 1819 న జన్మించారు.   ఈమె United Kingdom of Great Britain‌ మరియు ఐర్లాండ్ కు క్వీన్‌ గా 1837 వ సంవత్సరము జూన్‌ 20 నుంచి ,‌ తరువాత  1876 వ సంవత్సరము  మే 1 నుంచి భారత దేశంలోని బ్రిటిష్‌ రాజ్యానికి తొలి రాణిగా మరణించే వరకు కొనసాగారు.   ఈమె 22 జనవరి 1901 వ సంవత్సరములో మరణించింది.  విక్టోరియా రాణి  బ్రిటీష్‌ రాజుల కంటేను , అదే విధంగా చరిత్రలోని ఇతర రాణుల కంటే ఎక్కువ కాలం పరిపాలించారు. 
ఈమె పరిపాలించిన కాలాన్ని విక్టోరియన్‌ ఎరా అంటారు కాలంలో బ్రిటీష్‌ సామ్రాజ్యంలో పారిశ్రామికసాంస్కృతికరాజకీయశాస్త్రసైనిక రంగాలు అభివృద్ధి సాధించాయి.
ఈమె తన 18 ఏట పాలనా బాధ్యతలు పొందిందిఆమె సింహసనం అధిష్టించే నాటికే బ్రిటన్‌ రాజ్యాంగం ఉన్న సుస్ధిర సామ్రాజ్యంరాజు లేదా రాణికి కొన్ని స్వచ్ఛంద అధికారాలు ఉన్నాయివాటిని ప్రధాన మంత్రి సలహా మేరకు అమలు చేయవచ్చుకానీ రాణికి ఎంతో కీలకమైన గుర్తింపు ఉండేదిఆమె కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తిగా విస్తరించిందిరవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు సంపాదించుకున్నది.  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)