బ్రిటన్ రాణి విక్టోరియా, ఇంగ్లండుకు చెందిన మహారాణి. |
1858 నుండి 1947 మధ్య భారత దేశము లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుంది. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న పాలనను 1858లో విక్టోరియా రాణి కిరీటాని ధరించిన తరువాత 1876లో ఈమెను భారత దేశపు సామ్రాఙ్ఞిగా ప్రకటించారు, అప్పుడు ఈమె పాలనా వ్యవస్థను సంస్థాగతం చేయబడింది. బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 1947 వరకూ కొనసాగింది. ఈమె జీవించి ఉన్నంత కాలము భారత దేశాన్ని పరిపాలించినది.
విక్టోరియా పూర్తిపేరు అలెగ్జాండ్రినా విక్టోరియా. ఈమె 24 మే 1819 న జన్మించారు. ఈమె United Kingdom of Great Britain మరియు ఐర్లాండ్ కు క్వీన్ గా 1837 వ సంవత్సరము జూన్ 20 నుంచి , తరువాత 1876 వ సంవత్సరము మే 1 నుంచి భారత దేశంలోని బ్రిటిష్ రాజ్యానికి తొలి రాణిగా మరణించే వరకు కొనసాగారు. ఈమె 22 జనవరి 1901 వ సంవత్సరములో మరణించింది. విక్టోరియా రాణి బ్రిటీష్ రాజుల కంటేను , అదే విధంగా చరిత్రలోని ఇతర రాణుల కంటే ఎక్కువ కాలం పరిపాలించారు.
ఈమె పరిపాలించిన కాలాన్ని విక్టోరియన్ ఎరా అంటారు. ఈ కాలంలో బ్రిటీష్ సామ్రాజ్యంలో పారిశ్రామిక, సాంస్కృతిక, రాజకీయ, శాస్త్ర, సైనిక రంగాలు అభివృద్ధి సాధించాయి.
ఈమె తన 18వ ఏట పాలనా బాధ్యతలు పొందింది. ఆమె సింహసనం అధిష్టించే నాటికే బ్రిటన్ రాజ్యాంగం ఉన్న సుస్ధిర సామ్రాజ్యం. రాజు లేదా రాణికి కొన్ని స్వచ్ఛంద అధికారాలు ఉన్నాయి. వాటిని ప్రధాన మంత్రి సలహా మేరకు అమలు చేయవచ్చు; కానీ రాణికి ఎంతో కీలకమైన గుర్తింపు ఉండేది. ఆమె కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తిగా విస్తరించింది. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు సంపాదించుకున్నది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.