జీవులు ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషము కంటే ఎక్కువ వుండలేరు. కారణము మెదడులోని కణాలకు ఆక్సిజన్ అవసరము. అలా ఆక్సిజన్ సరిగా అందకపోతే కొద్ది నిముషములలోనే స్పృహ కోల్పోతారు. కొంతమందికి ఉపిరి సరిగా పిల్చుకోలేక ఇబ్బంది పడతారు. అప్పుడు హాస్పిటల్స్ లో కృత్రిమ ఆక్సిజన్ అందిస్తారు కదా. ఆ ఆక్సిజన్ కనుకున్నతను జోసెఫ్ ప్రీస్ట్లీ. అతని గురించి తెలుసుకుందాం. భూమి మీద జీవులందరికీ అత్యవసరం ఈ వాయువు చాలా అవసరం దీనిని మన వాడుక భాషలో ఆమ్లజని అంటాం. ఆక్సిజన్ ను మొట్ట మొదట కనుక్కొన్నది ఎవరో తెలుసా అతనే జోసెఫ్ ప్రీస్ట్లీ (మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ప్రీస్ట్లీ చాలా Gases ను కనుక్కొన్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్ మోనాక్సైడు( CO), నైట్రస్ ఆక్సైడు (Laughing Gas ) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ప్రీస్ట్లీ కనుక్కొన్నవాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్. ఆక్సిజన్ కు "dephlogisticated air" అని పేరు పెట్టారు.
ఇంగ్లండ్‌లోని లీడ్స్ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్ ప్రీస్ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, అరబిక్ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్‌గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్‌పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్‌గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్‌పై అధ్యయనం చేసి 'History and present of electricity'అనే గ్రంథాన్ని ఆయన రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా Royal Society Fellow గా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో America వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా Northumberland County, Pennsylvania లో ఆయన ప్రయోగశాలను నేషనల్ మ్యూజియంగా ప్రకటించారు.
ఈరోజు భీష్మ ఏకాదశి. ఇది ఏకాదశి లలో చాలా విశేషమైన ఏకాదశి. ఈరోజు భీష్మ పితామహుల నోటినుండి విష్ణు సహస్ర నామము అందరికీ ఉపదేసించబదినది. నేడు విష్ణు సహస్రం పుట్టినరోజు అన్నమాట. తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే. ఒక మెట్టు ఎక్కువగా తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.
అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్టమధ్యాహ్నం వేళ శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే. భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసేస్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను. అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.
ప్రార్థన
ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకు నకు, విష్వక్సేను నకు, వ్యాసు నకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.
ముఖ్య స్తోత్ర:
అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:
కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?
కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్- జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్- ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః- మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును? అన్న ప్రశ్నలు అడుగగా.....
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంధం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
ఈరోజు అందరు ఇళ్ళల్లోను, గుళ్ళలోను విష్ణుసహస్రనామ స్తోత్రం పూజలు చేస్తున్నారు. నేడు విష్ణువు గురించి, భీష్ములవారి గురించి , విష్ణుసహస్రము గురించి తెలుసుకున్నాము. మనజన్మ ధన్యము అయినట్టే కదా. విష్ణుసహస్రనామస్తోత్ర జన్మదిన శుభాకాంక్షలు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు అన్నారు. అది నిజమే అన్నట్టు కల్పనా చావ్లా జీవితమూ నిరూపిస్తుంది. ఈమె తన చిన్నతనము నుండే అంతరిక్షములోనికి ఎలావేల్లాలి అని కలలు కనేది. తన కలలను నేరవేర్చుకున్నది.
తొలిసారి 1997లో అంతరీక్ష యాత్ర చేసిన ఈ మొట్టమొదటి ఆసియా మహిళా వ్యోమగామి కల్పన. అమెరికా అంతరిక్షయాన సంస్థ అయిన "నాసా"లో వ్యోమగామి విధులు నిర్వహిస్తున్న కల్పన.2003లో కొలంబియా అంతరిక్ష నౌకలో రోదసిలోకి వెళ్ళి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగాను, రెండో భారతీయ వ్యక్తిగాను పేరు సంపాదించింది. ఇదే కొలంబియా అంతరిక్షనౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం ఏడుగురు వ్యోమగాముల్లో కల్పనా చావ్లా ఒకరు కావడం విషాదకరం.
కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కి.మీ ఎత్తున ప్రయాణిస్తూ... మరో 16 నిముషాల కాలంలో కేప్ కెనవరాల్‌లోని కెనడీ అంతరీక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కొలంబియాలో ప్రయాణిస్తున్న కల్పనా చావ్లా (మిషన్ స్పెషలిస్టు) సహా మరో ఆరుగురు వ్యోమగాములు హజ్బెండ్ (కమాండర్), ఆండర్సన్ (పేలోడ్ కమాండర్), మెక్కూల్ (పైలట్), ఇలాన్ రామన్ (పేలోడ్ స్పెషలిస్టు), బ్రౌన్, క్లార్క్ (మిషన్ స్పెషలిస్టులు) ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమయంలో గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక విస్ఫోటనానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ శకలాలు విషపూరిత రసాయనాలతో కూడినవి అయి ఉన్నందున పౌరులెవరూ వాటి చాయలకూ పోరాదని నాసా హెచ్చరించింది. కాగా. 40 ఏళ్లకు పైబడిన నాసా చరిత్రలో మానవ వ్యోమనౌక భూమికి తిరిగివస్తూ ఆపదకు గురికావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కల్పనా చావ్లా అనే పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ధైర్యం. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన ఆమె... అంతరిక్షంలో ఏవేని చిన్న పొరపాట్లు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసిన ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించి మళ్లీ ఆకాశంలోకే పయనమైపోయారు. భౌతికంగా ఆమె మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా కల్పన పేరు ఈ భూప్రపంచంపైన మార్మోగుతూనే ఉంటుంది.