జీవులు ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషము కంటే ఎక్కువ వుండలేరు. కారణము మెదడులోని కణాలకు ఆక్సిజన్ అవసరము. అలా ఆక్సిజన్ సరిగా అందకపోతే కొద్ది నిముషములలోనే స్పృహ కోల్పోతారు. కొంతమందికి ఉపిరి సరిగా పిల్చుకోలేక ఇబ్బంది పడతారు. అప్పుడు హాస్పిటల్స్ లో కృత్రిమ ఆక్సిజన్ అందిస్తారు కదా. ఆ ఆక్సిజన్ కనుకున్నతను జోసెఫ్ ప్రీస్ట్‌లీ. అతని గురించి తెలుసుకుందాం. భూమి మీద జీవులందరికీ అత్యవసరం ఈ వాయువు చాలా అవసరం దీనిని మన వాడుక భాషలో ఆమ్లజని అంటాం. ఆక్సిజన్ ను మొట్ట మొదట కనుక్కొన్నది ఎవరో తెలుసా అతనే జోసెఫ్ ప్రీస్ట్‌లీ (మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ప్రీస్ట్‌లీ చాలా Gases ను కనుక్కొన్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్ మోనాక్సైడు( CO), నైట్రస్ ఆక్సైడు (Laughing Gas ) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ప్రీస్ట్‌లీ కనుక్కొన్నవాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్. ఆక్సిజన్ కు "dephlogisticated air" అని పేరు పెట్టారు.
ఇంగ్లండ్‌లోని లీడ్స్ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్ ప్రీస్‌ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, అరబిక్ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్‌గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్‌పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్‌గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్‌పై అధ్యయనం చేసి 'History and present of electricity'అనే గ్రంథాన్ని ఆయన రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా Royal Society Fellow గా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో America వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా Northumberland County, Pennsylvania లో ఆయన ప్రయోగశాలను నేషనల్ మ్యూజియంగా ప్రకటించారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.