శ్రీ రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18, 1836 న జన్మించారు. ఈయన హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను రచించెను.
రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. అతను సాధువులు చెప్పే ఉపన్యాసములు చాలా శ్రద్ధగా వినేవారు. అప్పటినుండి ఆయనలో ఆద్యాత్మిక భావన ఎక్కువ అయ్యింది అనుటలో సందేహం లేదు.
గుడిలో విగ్రహం లో ఆయినా సజీవ దేవుడును చూసారు. కాళీ మాతను పూజించేవారు. ఎక్కువ అద్యాత్మికత కలిగివుండటం వాళ్ళ రాత్రి పగలు తేడాలేకుండా ఎప్పుడు ద్యానంలోనే వుండేవారు. అది చూచి అందరు రామకృష్ణ కు వివాహం చేయమని అందరు సూచించారు. అప్పుడు ఐదు సంవత్సరాల శారదామాత తో వివాహం జరిపించారు. ఈ శారదా మాతే శ్రీ రామకృష్ణ పరమహంస వారి ప్రధమ శిష్యురాలు గా వుంది. ఆమె రామకృష్ణ పరమహంస గారి అడుగు జాడలలోనే నడిచింది. ఆమె కూడా ఆద్యాత్మికత అలవర్చుకున్నది.
రామకృష్ణ పరమహంస శారదామాతను దేవత పూజించుట |
ఆమెను రామకృష్ణులవారు కాళీమాతగా కొలచి పూజించేవారు. రామకృష్ణ పరమహంస అనేకమంది శిష్యులను మనకు అందించారు అందులో ముఖ్యడు వివేకానంద స్వామి.
రామకృషుని బోధనల లో ముఖ్యాంశములు. భగవద్ తత్వం గురించి చెప్పారు.
- సృష్టి లో ఏకత్వము
- అన్ని జీవులలో దైవత్వము
- ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
- మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
- మానవసేవే మాధవసేవ
- ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
- జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
- మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
- భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.
- బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
- కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.