టెలిస్కోప్
ఎవరు కనుక్కున్నారు అనగానే అస్సలు ఆలోచించకుండా చెప్పే ఆన్సర్ గెలీలియో
అని. గెలీలియో జయంతి ఫిబ్రవరి 15, 1564లో
జన్మించిన గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు.
చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య
విద్యార్ధిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర
ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం
చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రాచార్యుడిగా
పనిచేశారు. గడియారంలోని
లోలకం ఈయన పరిశోధనల ద్వారానే
ఆ తరువాత ఆవిష్కరించబడింది. మొదటిసారిగా చంద్ర మండలాన్ని పరిశీలించాడు.
పాలపుంత అనేక నక్షత్రాల సముదాయమని
మొదటగా చెప్పింది ఈయనే. ఈయన పరిశోధనలూ,
అభిప్రాయాలూ నచ్చని మతాధిపతుల హింసలు భరించలేక వారికి లొంగి పోయాడు.
గెలీలియో
కాలం అనగా 16 వ శతాబ్దం వరకు
క్రీ..పూ. 4వ శతాబ్దంలో
గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం
లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు:
అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను
కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా
వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు
తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం పైనుంచి
100 పౌండ్లు, 1 పౌండు బరువు గల
రెండు ఇనప గుండ్లను ఒకేసారి
క్రిందికి వదలి, అవి రెండూ
ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు.
భౌతికశాస్త్ర
పితామహునిగా పరిగణింపబడే గెలీలియో జనవరి 08, 1642లో మరణించాడు.
అన్నింటికన్నా దారుణం ఆయన పరిశోధనా వ్యాసాలను మతాధికారులు ఆయన మరణానంతరం తగలబెట్టారు. అయినా, విజ్ఞాన ప్రగతి ఆగిందా? ఆయన నిరూపించిన సిద్ధాంతం ఈనాటికీ అందరికీ ఆమోదయోగ్యమైంది. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి, ప్రపంచంమంతటా వెలుగులు నింపాలని, ప్రయత్నించిన ఒక మహానుభావుడిని మతాధికారుల మూర్ఖత్వం బలిగొంది. ఆయన కీర్తిని సూర్యమండలం మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.