శుక్రవారం, మార్చి 02, 2012
మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 37 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. మా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ శ్రీమతి చింతా.విజయలక్ష్మి, మా తాత శ్రీ చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేనేకాకుండా నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మావయ్య కూతురు విజయ లహరి, మరియు మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు- మెఘన, స్ఫూర్తి లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 37 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరందరి తరుపునా తాత అమ్మమ్మా..... మీకు
Many More Happy Returns Of The Day .
గురువారం, మార్చి 01, 2012
|
పొడుపు కధలు నేను అడుగుతాను మీరు విప్పండి. |
1 .సూర్యుడు చూడని గంగ
చాకలి వుతకని మడుగు
ఏమిటది?
2 . అంగుళం పెట్టెలో అరవైమంది
నల్లగుండు వారు ?
3 . ఎక్కలేని మానుకు
దిక్కులేని కాపు ఏమి అది?
4 . దోసెడు నీలలో దొరసాని జలకాలడుతోంది ఏమి అది?
5 . వాకిట్లో పరచుకొని పడుకొను.
మూలన ముడుచుకొని నించును ఏమిటది?
తెలిస్తే చెప్పేయండి మరి.
మంగళవారం, ఫిబ్రవరి 28, 2012
నేడు జాతీయ విజ్ఞాన దినోత్సవము.
1929 వ సంవత్సరము ఫిబ్రవరి 28 వ తేదిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన తొలి బారతీయ భౌతిక శాస్త్రవేత్త
సర్ C .V . రామన్ తన రామన్ ఎఫ్ఫెక్ట్ ను కనుక్కున్న రోజు. ఈరోజును నేషనల్ సైన్సు డే గా జరుపుకుంటున్నారు.
1986 నుండి జరుపుకొంటున్నాం. సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం. సైన్సు డే సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
1948 వ సంవత్సరము ఫిబ్రవరి 28 న ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
తన కార్యకలాపాల మొదటి శతాబ్దంలో, ఇంగ్లీష్ ఈస్ట్ భారతదేశము కంపెనీ భారత ఉపఖండముతో వ్యాపారము పైన దృష్టి ఉంచారు. ఎందుకంటే అది తనకు వ్యాపార హక్కులను 1617లో మంజూరు చేసిన శక్తి వంతమైన మొఘల్ సామ్రాజ్యము ను ఎదుర్కొనే స్థితిలో లేదు. 18 వ శతాబ్దములో మొఘలుల శక్తి క్షీణించడముతో ఈ పరిస్థితి మారింది మరియు ఈస్ట్ భారతదేశము కంపెనీ తన సమకాలీనులైన ఫ్రెంచ్, ది కంపనీ ఫ్రాన్చైసే దేశ ఇందేస్ ఒరిఎంతెల్స్ తో 1740లు మరియు 1750లలో కర్నాటిక్ యుద్ధాల సమయంలో పోరాడవలసి వచ్చింది. 1757లో ప్లాస్సి యుద్ధము లో రాబర్ట్ క్లైవ్ సారధ్యము వహించిన బ్రిటిష్, నవాబ్ ఆఫ్ బెంగాల్ ను మరియు ఆయన ఫ్రెంచ్ సంకీర్ణ సేనలను ఓడించింది. ఆ తరువాత కంపెనీని బెంగాల్అధీనంలో వదిలి భారత దేశంలో అతిపెద్ద సైన్య మరియు రాజకీయ శక్తి గా చేసింది. ఆ తరువాతి దశాబ్దాలలో అది క్రమంగా తన అధీనంలోని భూభాగాల పరిధిని పెంచుకుంటూ వచ్చింది. తాను నేరుగా పాలించడము కాని లేదా ప్రాంతీయ తోలు బొమ్మ పాలకులను ఉంచి పాలించడము గాని చేసింది. ఈ పాలకులు బ్రిటిష్ ఇండియన్ సేనల ఒత్తిడిలో ఉండేవారు. ఈ సైన్యంలో ఎక్కువ శాతం భారతీయ సిపాయిలు ఉండేవారు. సిపాయి అనగా "సైనికుడు". బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు. వీరు 1857లోని సిపాయిల తిరుగుబాటులో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము. అక్కడ మొదలు అయ్యింది మన భారతీయులలో విప్లవo జ్యోతి రగిలింది. ఎలాగినా బ్రిటిష్ వారిని మన భారత దేశము నుండి పంపించాలని అనుకున్నారు. అప్పుడు మొదలు అయిన విప్లవంలో చాలా మంది భారతీయులు ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాటం సాగించారు. అనేకమంది ప్రాణాలు వదిలారు. కొందరు హింసావాదంతో విప్లవం చేసారు. మరి కొందరు అహింసా వాధముతో విప్లవం చేసారు. ఏదిఏమి అయినా అందరి ముఖ్య ఉద్దేశము స్వరాజ్య సాధన. ఆపోరాటం కొన్ని సంవత్సరములు సాగించారు. ఆఖరికి స్వరాజ్యాన్ని సాధించారు. స్వరాజ్య భారతావని ని మనకు అందించారు. మనకు 1947 వసంవత్సరము ఆగష్టు 15 న స్వాతంత్రము ఇచ్చారు. 1948 వ సంవత్సరము ఫిబ్రవరి 28 న ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. అందుకే ఇదంతా గుర్తు చేస్తున్నాను.
|
Lord Louis Mountbatten and his wife Edwina the last British Viceroy of India |
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ