పొడుపు కధలు నేను అడుగుతాను మీరు విప్పండి. |
1 .సూర్యుడు చూడని గంగ
చాకలి వుతకని మడుగు
ఏమిటది?
2 . అంగుళం పెట్టెలో అరవైమంది
నల్లగుండు వారు ?
3 . ఎక్కలేని మానుకు
దిక్కులేని కాపు ఏమి అది?
4 . దోసెడు నీలలో దొరసాని జలకాలడుతోంది ఏమి అది?
5 . వాకిట్లో పరచుకొని పడుకొను.
మూలన ముడుచుకొని నించును ఏమిటది?
తెలిస్తే చెప్పేయండి మరి.
kantilo kanneru,aggipullalu,chukkalu, chepa,godugu.
రిప్లయితొలగించండి2) aggi petta
రిప్లయితొలగించండి5) cheepuru
2.అగ్గిపెట్టె
రిప్లయితొలగించండి3.నక్షత్రాలా?
5.చాప
1. కొబ్బరి నీళ్లు.
రిప్లయితొలగించండి2. అగ్గిపెట్టె.
3. మిరపచెట్టు.
4. వెన్నముద్ద.
5. చాప.
"పొడుపు కధలు నేను అడుగుతాను మీరు విప్పండి."
కి ఇవే జవాబులు.