Blogger Widgets

శనివారం, మార్చి 10, 2012

తాటి ఆకు బొమ్మలు

శనివారం, మార్చి 10, 2012

 
                                      

శుక్రవారం, మార్చి 09, 2012

బార్బీ బొమ్మ

శుక్రవారం, మార్చి 09, 2012

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా ప్రియమైన బార్బీ బొమ్మ యొక్క పుట్టినరోజు.
మొట్ట మొదట నా బార్బీ బొమ్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.  ఈ రోజు బార్బీ బొమ్మ యొక్క కదా నేను మీకు చెప్పేస్తాను. 

రూథ్ హాండ్లర్.
ఈ బొమ్మ యొక్క సృష్టి కర్త రూథ్ హాండ్లర్. రూత్ తన కూతురు బార్బారా చిన్న చిన్న పేపర్ బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించింది. ఆవిడ కూతురు ఆ బొమ్మలకు పెద్దవారి పాత్రలు కల్పించి ఆడుకుంటూ ఉండేది. అప్పటివరకు చిన్న పిల్లల బొమ్మలన్నీ చిన్న పిల్లల పాత్రల్లోనే ఉండేవి.   రూథ్ హాండ్లర్ నిర్వహణి మాటెల్ యొక్కసహ-స్థాపకుడు, ద్వారా 1959 లో కనుగొన్నారు. 
బార్బీ న్యూయార్క్ నగరంలో అమెరికన్ టాయ్ఫెయిర్ వద్ద ప్రపంచానికి పరిచయం చేశారు. బొమ్మ ఒక యువ ఫ్యాషన్ బొమ్మ ఉద్దేశించబడింది.అది బార్బీ యొక్క ఫిగర్ కొంత వివాదం ఉంది. కెన్ బొమ్మ రూత్ కొడుకు పేరు పెట్టారు. బార్బీ మొదటి 1965 లో bendable కాళ్లు వచ్చింది.
రొమ్ము క్యాన్సర్ తో బాధపడ్డారు  మరియు 1970 రూత్ ఒక శస్త్ర చికిత్స ద్వారా స్తనమును తొలగించుట జరిగింది.  ఆ తరువాత రూత్ బార్బీ డాల్ ను తయారు చేయటము లో తన కృషి పూర్తిగా సాగించారు.  ఆ బొమ్మకు తన కూతురు పేరు బార్బీ పేరు పెట్టారు. 1975 లో నిర్వహణ కోసం ఒక పేటెంట్ సంపాదించారు.  ఆమె ఒక గొప్ప businesswoman గా మారారు.   అప్పట్లో ఈ బిలియన్ బార్బీ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా అమ్మాబడ్డాయి.

నారాయణుడీతడు నరులాల

నారాయణుడీతడు నరులాల
నారాయణుడీతడు నరులాల
మీరు శరణనరో మిమ్ము గాచీని

తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారికి కైవసమెపుడు
కొలచెను మూడడుగుల జగమెల్లాను
కొలిచినవారిని చేకొనకుండునా

యెక్కడ పిలిచినా ఏమని పలికీ
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణచి రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగా నేలడా

చూచిన యందెల్ల చూపును రూపము
వోచిక పొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుడే యితడట
చేచేత పూజింప సేవలుగొనడా

గురువారం, మార్చి 08, 2012

చింతా. రామకృష్ణా రావుగారి సన్మాన చాయా చిత్రాలు.

గురువారం, మార్చి 08, 2012

ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో మా తాత గారు చింతా  రామకృష్ణా రావు గారి కి సన్మానం చేసారు.  దానికి గాను తాత గారు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి మాటలతో పాటు సన్మాన ఛాయాచిత్రాలు ఇక్కడుంచాను.


ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో అవ్యాజానురాగంతో నన్ను సత్కరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ కుమార్ గారు, నెల్లూరుకు చెందిన జమీన్ రైతు పత్రికా సంపాదకులు గౌరవనీయులు శ్రీ యన్. డోలేంద్ర ప్రసాద్ గారు, మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణగారు, జాతీయ బహుమతి గ్రహీత శ్రీ దివాన్ చెరువు శర్మగారు, డా. జాంపండు మాష్టారు, ప్రజా పత్రిక నిర్వాహకులు శ్రీమతి రమాదేవి గారు, గౌరవ నిర్వాహకులు యస్.సుదర్శన్ గారు, ప్రజాపత్రిక కుటుంబ సభ్యులు, మున్నగు  యావన్మందికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.

మరి సన్మానానికి సంభందించిన కొన్ని చాయా చిత్రాలు ఇవిగో.



తాతగారి  " ఆంధ్రామృతం "  అంతర్జాల పత్రికలో గల రచనలను చూచి, " శ్రీ వేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము మున్నగు వానిని పఠించి, మీ రచనా పటిమను గుర్తించి జరిపిన సాన్మానమునకు తాతగారు  నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)