నారాయణుడీతడు
నరులాల
నారాయణుడీతడు
నరులాల
మీరు
శరణనరో మిమ్ము గాచీని
తలచిన
చోటను తానే ఉన్నాడు
వలెనను
వారికి కైవసమెపుడు
కొలచెను
మూడడుగుల జగమెల్లాను
కొలిచినవారిని
చేకొనకుండునా
యెక్కడ
పిలిచినా ఏమని పలికీ
మొక్కిన
మన్నించు మునుముగను
రక్కసుల
నణచి రక్షించు జగములు
దిక్కని
నమ్మిన తిరముగా నేలడా
చూచిన
యందెల్ల చూపును రూపము
వోచిక
పొగడిన వుండు నోటను
యేచిన
శ్రీవేంకటేశుడే యితడట
చేచేత
పూజింప సేవలుగొనడా
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.