ఈ రోజు మాతృపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందుకుగాను ముందుగా మన మాతృ భూమికి (భారతమాత )కు మరియు ప్రపంచంలో వున్నా మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు.
సృష్టిలో అమ్మ లేనిజీవి అన్నది లేదు . ఎక్క డైనా చెడ్డ బిడ్డ వుండవచ్చేమో కాని చెడ్డ తల్లి అన్నది వుండదుట. ఏ తల్లి అయ్యినా తన బిడ్డ గొప్పగా వుండాలి అని కోరుకుంటుంది. మనకు ప్రపంచంలో కెల్లా అతి తియ్యనైన పదం అమ్మ . అమ్మప్రేమ కంటే గొప్ప ప్రేమ , అమ్మకంటే గొప్ప రక్షణ , అమ్మ కంటే గొప్ప గురువు, అమ్మ కంటే గొప్ప దైవం ఎక్కడా లేదు. ఇది నిజం . అలాంటి అమ్మ ఋణము మనం ఎన్ని జన్మలుఎత్తినా తీర్చలేము.
ఈ సందర్బములో నాకు ఒక కదా గుర్తు వస్తోంది అది ఏమిటి అంటే!!!!! ఈ కదా అమ్మ ప్రేమకు ఒక నిదర్సనం అని చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో ఒక అమ్మ వుంది ఆ అమ్మకి ఒక బిడ్డ వున్నాడు. అతను అన్ని చెడ్డ అలవాట్లు కలిగి వుంటాడు. అతనికి ఒక ప్రియురాలు వుంది ఆమె ఒకనాడు నాకు తల నొప్పిగా వుంది అని చెప్పింది. ఆ తలనొప్పి తగ్గాలి అంటే అతని అమ్మ హృదయపు రక్తం రాస్తే తగ్గుతుంది అని చెప్పింది. అప్పుడు ఆతను మాఅమ్మ హృదయం ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్లి అమ్మని అడిగాడు. అమ్మా నీ హృదయం కావాలి అని అడిగాడు. ఆమె వెంటనే సరే నాయనా తప్పకుండా తీసుకో అంది. అప్పుడు ఆతను తల్లిని పొడిచి హృదయాన్ని తీసుకున్నాడు. ఆ హృదయం రక్తం కారుతోంది దానిని తన చేతిలో తీసుకొని వెళ్తూ వుండగా ఆ రక్తం లో జారి పడబోయాడు. అప్పుడు అమ్మ హృదయం తల్లడిల్లిపోయి బాబూ జాగ్రత్త చూసుకొని నడువు నాయనా అంది. అప్పుడు ఆ కొడుకులో మార్పు వచ్చి ఇంత మంచి అమ్మనా నేను చంపింది అని ఏడుస్తాడు. చూసారా ఎక్కడైనా అమ్మ మంచిగానే వుంటుంది. అలాంటి అమ్మను మనం కష్టపెట్టకూడదు.
మనకు తెలిసిన రామాయణంలో రాముడు తల్లి (కైకెయి)కోరికకు కట్టుబడి అడవికి వెళ్లి ఎన్నోకస్టాలు అనుభవించాడు. కృష్ణుడు, యశోద ప్రేమ మనం వర్ణించలేము. అర్జునుడు ద్రుపది స్వయంవరంలో గెలిచిన ద్రుపధిని పాండవులు తల్లిమాట విని ద్రౌపదిని ఐదుగురు భార్యగా పొందారు. తరువాత చత్రపతి శివాజి తనతల్లి కొరికను నెరవేర్చి. చక్రవర్తి అయ్యాడు. గాంధి గారుకు తన తల్లి తన చిన్నప్పటి నుండి అనేక కదలు చెప్పేది. ఆ కధలు గాంధిగారికి మార్గనిర్ధేశకంగా నిలిచాయి.
మనకు పంచ మాత లు కలరు అని కుమారశతకంలో ఇలా అన్నారు.
ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !
భావం:రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త) మరియు కన్న తల్లి - పంచమాతలు గా భావించవలెను.
అమ్మని ఇప్పుడు mommy అని పిలుస్తున్నారు. mommy అన్న పదం కంటే అమ్మ అన్న పదం లోనే తియ్యదనం వుంది అని తెలుసుకుంటే బాగుంటుంది.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి .........
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్న పాట రాసారు ఇది అక్షరసత్యం అని గ్రహించగలరు. ఎందరో కవులు అమ్మ గురించి వర్ణించటానికి ప్రయత్నించారు. కానీ ఎవరు రాయగలరండి అమ్మ గురించి.
అమ్మలందరికి మాతృ పూజా దినోత్సవం శుభాకాంక్షలు.
(మా అమ్మకి)I love You Amma.