ఆదివారం, మే 13, 2012
|
సర్ రోనాల్డ్ రాస్ మలేరియ చక్రం |
సర్ రోనాల్డ్ రాస్ తెలియని వారు వుండరు అనుకుంటున్నా. ఈయన ప్రముఖ ఆంగ్లో ఇండియన్ శాస్త్ర వేత్త. నేడు సర్ రోనాల్డ్ రాస్ పుట్టిన రోజు సందర్బముగా సింపుల్ గా ఈయన గురించి తెలుసుకుంనే ప్రయత్నం చేద్దాం. ఈయన మలేరియా పారసైట్ యొక్క జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడినది. ఈయన హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపారు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్" గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు. రొనాల్డ్ రాస్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా లో జన్మించారు. ఇతని తండ్రి జనరల్ సర్ గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పనిచేశారు. ఎనిమిది సంవత్సరాల వయసులో రాస్ ను విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండు పంపించారు. రైడ్ లో ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత 1869లో సౌతాంప్టన్ లోని బోర్డింగ్ పాఠశాల కు పంపించారు.
రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. తర్వాత రోయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం (Membership of the Royal College of Surgeons:MRCS) పొందాడు. ఇతడు 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసు లో చేరి ముందుగా మద్రాసులో పనిచేశాడు.
Sir Ronald Ross Institute of Tropical and Communicable Diseases హైదరాబాద్ లో ఈ మలేరియ వ్యాధి గురించి పరిశోధించి విజయం సాధించారు. ఇందుకు గాను ఈయనికి నోబెల్ బహుమతి ఇచ్చారు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.