Blogger Widgets

బుధవారం, జూన్ 20, 2012

కృష్ణం కలయ సఖి

బుధవారం, జూన్ 20, 2012

నారాయణ తీర్థులవారి కృతి

రాగం: ముఖారి
గళం: శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ



కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం



కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం



మంగళవారం, జూన్ 19, 2012

బుద్దుడి సూక్తి (సుబ్బడు మారాడు).

మంగళవారం, జూన్ 19, 2012


సమస్త ప్రాణులూ, పెద్దవి గానీ, చిన్నవి గానీ; బలమైనవి గానీ, బలహీనమైనవి గానీ ;  కనిపించేవి గానీ, కనిపించనివి గానీ; దగ్గరగా వున్నవిగానీ, దూరంగా వున్నవిగానీ; పుట్టినవి గానీ, దూరంగా వున్నవిగానీ; అన్నీ, ఎల్లప్పుడూ, శాంతి సౌఖ్యాలతో ఓలలాడాలి!

బుద్దుడి సూక్తి.

నాకు ఈ సూక్తి ఎందుకు గుర్తువచ్చింది అంటే  నేను రాత్రి ఒక కధ చదివాను.   ఆకధ మీకు కూడా షేర్ చేస్తానులెండి.  కదా పేరేమో  సుబ్బడు మారాడు.
 సుబ్బడు రెండో తరగతి చదువుతున్న పిల్లవాడు.  అతని పేరు సుబ్రహ్మణ్యం.  అందరు అతన్ని అందరు ముద్దుగా సుబ్బడు అంటారు.  ఈ పిల్లడు బాగా అల్లరి పిల్లోడుఅన్నమాట .  ఈ పిల్లాడు రోజు స్కూల్  కి వెళ్ళేటప్పుడు దారిలో చెట్ల మీద వుండే పక్షులను రాళ్ళు విసిరి కొట్టేవాడు.   కుక్కలను కర్రతో బెదిరించేవాడు.  చీమల బారులను పుల్లలతో చెదరకోట్టేవాడు.  ఆపిల్లాడు గురించి చెప్తే మనకు ఒక రోజు సరిపోదేమో.  వాళ్ళ అమ్మగారు ఎప్పుడు నోరులేని జీవులను బాధపెట్ట కూడదు అని చెప్పేది .  ఈ సుబ్బడేమో చెప్పేది అసలు వినడు.  జంతువులను బాధపెట్టడము వీడికి బాగా అలవాటు అయిపోయింది.  వీడికి అదే ఆటగా మారిందంటే చూడండి ఎంత అల్లరో వాడు.
ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఒక పొదలోకి వెళ్ళాడు సుబ్బుడు.  అక్కడ వున్నా పక్షులన్నీఅరుచుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిరాయి, కుక్కలు మోరుగుతున్నాయి.  అలా హడావిడి గా వుంటే మన సుబ్బడు బయపడి కొంచెం దూరంగా వచ్చి ఆ పోదవైపు చూసాడు.  అక్కడ ఒక పెద్ద పాము కనబడింది.  భయంతో పారిపోయి అమ్మని గట్టిగా పట్టుకొని జరిగిన సంగతి.  పెద్ద పాముని చూసిన సంగతి చెప్పాడు.  అప్పుడు అమ్మ "చూసావా ? ఆ పిట్టలూ కుక్కలూ ఎంత మేలుచేసాయో! అవి లేకపోతే ఈ పాటికి ఏమి అయ్యేది?  పాము నిన్నుకరిచేది" అంది.
సుబ్బుడికి అప్పుడు అర్ధం అయ్యింది.  పక్షులు, జంతువులు ఎంత మంచివో తెలుసుకున్నాడు.  తాను ఎంత చెడ్డవాడో తెలుసుకొని.  అమ్మా ఇంకెప్పుడు వాటిని బాధపెట్టాను అన్నాడు.  అప్పటినుండి వాటికి నూకలు వేసి వాటిని బాదపెట్టడం మానేసాడు.  సుబ్బడు బలే మారిపోయాడు కదండి.  మనం కూడా సుబ్బడు లాగ జంతువులును అల్లరిపెట్ట కూడదు.  నాకు ఈ కదా బుద్దుని  సూక్తి నచ్చిందండి.  అందుకే మీతో షేర్ చేసుకున్నా. 

సోమవారం, జూన్ 18, 2012

దాచబడిన ముఖం

సోమవారం, జూన్ 18, 2012


నాకు ఈ క్రింది చిత్రంలో ఒక దాచబడిన ముఖం వుందిట. నాకు దొరకలేదు,  మీకు కనబడిందా?  కనబడితే చెప్పండి.  ముఖము వుందా లేదా అని.

ఆదివారం, జూన్ 17, 2012

Catch Me Live RadioJoshLive Harivillu.

ఆదివారం, జూన్ 17, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30am to 12:00pm

only on RadioJoshLive

masth maza masth music:) 

My show Name is Harivillu

Today my topic is about School Days and Father's Day Specials.

If you want to talk with me call these numbers  

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Thank You Very Much.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)