సమస్త ప్రాణులూ, పెద్దవి గానీ, చిన్నవి గానీ; బలమైనవి గానీ, బలహీనమైనవి గానీ ; కనిపించేవి గానీ, కనిపించనివి గానీ; దగ్గరగా వున్నవిగానీ, దూరంగా వున్నవిగానీ; పుట్టినవి గానీ, దూరంగా వున్నవిగానీ; అన్నీ, ఎల్లప్పుడూ, శాంతి సౌఖ్యాలతో ఓలలాడాలి!
బుద్దుడి సూక్తి.
నాకు ఈ సూక్తి ఎందుకు గుర్తువచ్చింది అంటే నేను రాత్రి ఒక కధ చదివాను. ఆకధ మీకు కూడా షేర్ చేస్తానులెండి. కదా పేరేమో సుబ్బడు మారాడు.
సుబ్బడు రెండో తరగతి చదువుతున్న పిల్లవాడు. అతని పేరు సుబ్రహ్మణ్యం. అందరు అతన్ని అందరు ముద్దుగా సుబ్బడు అంటారు. ఈ పిల్లడు బాగా అల్లరి పిల్లోడుఅన్నమాట . ఈ పిల్లాడు రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు దారిలో చెట్ల మీద వుండే పక్షులను రాళ్ళు విసిరి కొట్టేవాడు. కుక్కలను కర్రతో బెదిరించేవాడు. చీమల బారులను పుల్లలతో చెదరకోట్టేవాడు. ఆపిల్లాడు గురించి చెప్తే మనకు ఒక రోజు సరిపోదేమో. వాళ్ళ అమ్మగారు ఎప్పుడు నోరులేని జీవులను బాధపెట్ట కూడదు అని చెప్పేది . ఈ సుబ్బడేమో చెప్పేది అసలు వినడు. జంతువులను బాధపెట్టడము వీడికి బాగా అలవాటు అయిపోయింది. వీడికి అదే ఆటగా మారిందంటే చూడండి ఎంత అల్లరో వాడు.
ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఒక పొదలోకి వెళ్ళాడు సుబ్బుడు. అక్కడ వున్నా పక్షులన్నీఅరుచుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిరాయి, కుక్కలు మోరుగుతున్నాయి. అలా హడావిడి గా వుంటే మన సుబ్బడు బయపడి కొంచెం దూరంగా వచ్చి ఆ పోదవైపు చూసాడు. అక్కడ ఒక పెద్ద పాము కనబడింది. భయంతో పారిపోయి అమ్మని గట్టిగా పట్టుకొని జరిగిన సంగతి. పెద్ద పాముని చూసిన సంగతి చెప్పాడు. అప్పుడు అమ్మ "చూసావా ? ఆ పిట్టలూ కుక్కలూ ఎంత మేలుచేసాయో! అవి లేకపోతే ఈ పాటికి ఏమి అయ్యేది? పాము నిన్నుకరిచేది" అంది.
సుబ్బుడికి అప్పుడు అర్ధం అయ్యింది. పక్షులు, జంతువులు ఎంత మంచివో తెలుసుకున్నాడు. తాను ఎంత చెడ్డవాడో తెలుసుకొని. అమ్మా ఇంకెప్పుడు వాటిని బాధపెట్టాను అన్నాడు. అప్పటినుండి వాటికి నూకలు వేసి వాటిని బాదపెట్టడం మానేసాడు. సుబ్బడు బలే మారిపోయాడు కదండి. మనం కూడా సుబ్బడు లాగ జంతువులును అల్లరిపెట్ట కూడదు. నాకు ఈ కదా బుద్దుని సూక్తి నచ్చిందండి. అందుకే మీతో షేర్ చేసుకున్నా.
Good one
రిప్లయితొలగించండిthank U very much.
రిప్లయితొలగించండి