దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి.
Shri Durgashottaraashtanama Stotram
దుర్గాష్టకము
ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్ తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః
జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః
దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా!
శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ! అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా!
భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః
యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్
చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.
కాళరాత్రిచక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.
నవ దుర్గాలలో ఏడవ రోజు "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '
ఈమెకి నివేదనగా కదంబం అర్పిస్తారు.
కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '
ఈమెకి నివేదనగా కదంబం అర్పిస్తారు.