శనివారం, అక్టోబర్ 27, 2012
తగునయ్య హరినీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్య లక్ష్మి
కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా
సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి
అమ్ముమొనను జలధి నడచి లంక సాధించి
కమ్మర జెకొన్న సీత ఘన వీర లక్ష్మి
నరకాసరునడచి నవ్వుతా జేయివేసితివి
సరిగా సత్యభామెపో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపు గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించిన యాకె వరలక్ష్మి
నిండిన వురము మీద నిఖిల సంపదలతో
అండనుండె యాకెపో ఆదిలక్ష్మి
మెండగు శ్రీవేంకటాద్రిమీద నీసరుస నేగే
గండుమీరె కళాలతో కల్యాణ లక్ష్మి
|
పసిపాపల నవ్వులను, అందమైన పువ్వులును, అందమైన ప్రకృతిని, అందమైన చల్లని వెన్నెలను పంచే చంద్రుని చూసి ఆనందించని వారు వుండరట. మీరుకూడా ఏకీభావిస్తున్నారా లేదా? |
శుక్రవారం, అక్టోబర్ 26, 2012
ఒకరోజు మహావిష్ణువు నారదుల మధ్యసంభాషణ.
విష్ణువు :-నారదా ! పంచభుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:- భూమండలం లో భూమి ఒక వంతే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎలా గొప్పది.
నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:- అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:- అంత పెద్ద ఆకాశంలో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:- అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుపంలో తన పాదంతో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:- భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.
గురువారం, అక్టోబర్ 25, 2012
అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా
అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా
మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా
వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ