మంగళవారం, నవంబర్ 27, 2012
చూడవమ్మ యశోదమ్మ | వాడ వాడల వరదలివిగో ||
పొంచి పులివాలు పెరుగు | మించు మించు మీగడలు |
వంచి వారలు వట్టిన | కంచపుటుట్ల కాగులివో ||
పేరీ బేరని నేతులు | చూరల వెన్నల జున్నులును |
ఆరగించి యట నగుబాళ్ళు | పార వేసిన బానలివిగో ||
తెల్లని కను దీగల సోగల | చల్ల లమ్మేటి జవ్వనుల |
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి | కొల్లలాడిన గురుతు లివిగో ||
కార్తీక మాసం లో శుక్ల చతుర్దశి రోజు వైకుంఠ చతుర్ధశి అని కూడా అంటారు.
వైకుంఠ చతుర్ధశి కి ఒక మంచి కధ వుంది.
ఒకసారి ఒకానొక సమయం లో నారద మహాముని భూమిపై సంచరించిన తర్వాత వైకుంఠ ధామ్ చేరుకుంన్నాడు. విష్ణువు నారద మహా ముని పర్యటన వెనుక వున్నకారణం అడిగారు. నారదుడు సాధారణముగా ప్రజలుకు విష్ణువు యొక్క దీవెనలు ఎలా లభిస్తాయి అని అడుగగా. విష్ణువు వైకుంఠ చతుర్ధశి రోజున అతనికి పూజించే వారికి దీవెనలు తప్పక చేరుతాయి. వారికి స్వర్గానికి దారి ఏర్పడుతుంది అని సమాధానమిచ్చారు.
విష్ణువు అప్పుడు జై-విజయ్ లకు వైకుంఠ చతుర్ధశి రోజున స్వర్గ ద్వారాలు తెరవమని కోరాడు. విష్ణు ఈ రోజు పూజించేవారు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పారు.
కార్తీక వైకుంఠ చతుర్ధశి యొక్క ప్రాముఖ్యత:
ఈరోజు పరమశివుడు విష్ణువు ఒకటే అని గుర్తించిన రోజు. విష్ణువు కాశీలో శివుని వేయి తామర పుష్పాలు తో పూజించుతున్నారు. అప్పుడు శివుడు విష్ణువుని పరిక్షించాలి అనుకోని ఒక పువ్వును తగ్గించారు. విష్ణువు 1000 పువ్వులు పూజ చేస్తూవుంటే అందులో ఒక పువ్వు తగ్గుతుంది. అప్పుడు విష్ణువు ఆ ఒక్క పువ్వు స్థానంలో ఏమి ఉంచాలా అని ఆలోచించి. విష్ణువుని భక్తులు కమలనయనుడు అంటారు కదా అని ఆ పువ్వు స్థానంలో తన ఒక కంటిని అందించడానికి సిద్ధం అయ్యి. తన కంటిని తీసి శివుడుకు అర్పించారు. అప్పుడు శివుడు ఆనందం తో విష్ణువు దగ్గరకు చేరి తను చాలా ప్రసన్నుడు అయ్యానని చెప్పి. ఆ పరమేశ్వరుడు ఈ రోజున విష్ణు కు సుదర్శన చక్రమును ఇచ్చాడు. ఈ రోజు, విష్ణువు మరియు శివుని ద్వారా స్వర్గం యొక్క తలుపులు తెరవడం జరిగింది . ఈ రోజు ఉపవాసం వున్నవ్యక్తికి స్వర్గంలో అతని స్థానాన్ని సుస్థిరంగా వుంటుంది.
|
భీష్మ పితమః కు కూడా ఈ రోజు శ్రీ కృష్ణుడు ఉపదేశించినట్లు చెప్తారు. విష్ణువు కార్తీక శుక్ల చతుర్ధశి రోజున మత్స్య అవతారంగా అవతరించారు. |
ఆబోతునకు అచ్చువేసి వదులుట
మరల వశిష్ఠులవారు జనకునిని దగ్గర కూర్చోబెట్టుకుని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన విషయాలను ఉత్సాహంతో ఇలా చెప్పసాగిరి.
ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జన చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగున్న పుణ్యకార్యాల వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశించుటేగాక, వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూస్తుందురు. ఎవడు ధనవంతుడై ఉండీ పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినా చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.
కాబట్టి, ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలదీ దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతయూ జాగారముండి మరునాడు తమ శక్తికొలదీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు స్వరసుఖాలను అనుభవింతురు.
కార్తీకమాసములో విసర్జింపలసినవి
ఈ కార్తీక మాసంలో పరాన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధా భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు, సూర్యచంద్రగ్రహణపు రోజులలో భోజనం చేయరాదు. కార్తీక మాసములో నెల రోజులూ రాత్రులు భోజనం తినరాదు. విధవ వండినది తినకూడదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులూ తప్పనిసరిగా జాగారము ఉండవలెను.
కార్తీక మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. ఈ మాసంలో నూనె రాసుకుని తల స్నానము చేయరాదు, పురాణాలు విమర్శించరాదు. కార్తీక మాసములో వేడినీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కాబట్టి వేడినీటితో స్నానం చేయరాదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడువకుండా కార్తీక మాసవ్రతమును చేయవలెనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అలా చేయువారు గంగా, గోదావరి, సరస్వతీ, యమున నదుల పేర్లను మనసులో తలచుకుని స్నానము చేయవలెను.
ఏది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాత: కాలమున స్నానము చేయవలెను. అలా చేయనిచో మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, లేక ఇంటిలోని పంపువద్ద కానీ చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధుకావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు!!అని చదువుకుంటూ స్నానం చేయాలి. కార్తీక మాసవ్రతం చేసేవారు పగలు పురాణ పటనం, హరికథాకాలక్షేపాలతో కాలం గడపాలి. సాయంత్రం పూట సంధ్యావందనాలు పూర్తి చేసి పూజామందిరంలో దీపాలు వెలిగించి, శివకేశవుల్ని అష్టోత్తరాలతో పూజ జేయాలి. ఈ ప్రకారం శివపూజ చేసివారు ధన్యజీవులు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కారము చేసి సంతోషపర్చవలెను. ఇలా చేసినవారు నూరు అశ్వమేథ యాగములు చేసిన పుణ్యం, వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలం పొందుతారు.
ఈ కార్తీక మాసము నెలరోజులూ బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని, నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినవారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. చేయగల శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని చేయలేనివారు నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక వంటి వివిధ జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రం ప్రకారం ఆచరిస్తే పదిహేను జన్మల పూర్వజ్ఞానము కలుగుతుంది. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నాకూడా సకలైశ్వర్యములు కలిగి మోక్షాన్ని పొందుతారు.
సోమవారం, నవంబర్ 26, 2012
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ