Blogger Widgets

గురువారం, డిసెంబర్ 06, 2012

కార్తీక పురాణం 23వ రోజు

గురువారం, డిసెంబర్ 06, 2012

శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట
అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగగా అత్రిమహాముని యిట్లుచెప్పిరి- కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షతత్పరుడు, నితాన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదవెదా౦గవేత్తయై యుండను మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్నియేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పు రుషులలో వుత్త ముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏదేశమున, యేకాలమున, యేక్షేత్రమున యేవిధముగా శ్రీహరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీ వచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవీ సంసారసాగరమున దాటి మోక్ష ప్రాప్తినొందుదువు" అని పలికెను. అంతటా పురంజయుడు యాశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమద్యమున నున్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శేషశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచిపరవశమొంది, చేతులు జోడించి, " దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషి కేశా! ద్రోపది మాన సంరక్షకా! ధీన జన భక్త పొషా ! ప్రహ్లాదవరదా! గరుడ ధ్వజా ! కరి వరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్ర మును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పితదుపరి సపరివారుముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో , పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వార ములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్యసంయుత మై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయతలోచనులూ నైవిపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రాఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నలై, సదా మోహన హసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగ నలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషిత లై చిద్విలాసహసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.పురంజయుడు శ్రీ రంగక్షాత్రమున కార్తిక మాసవ్రత మాచరించి సతీ సమేతుడై యింటికి సుఖిముగాజేరేను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతుర్యధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత: పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియైదైవ భక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహికవాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారము వప్పిగించి పట్టాభిషీకూనిచేసి తను వానప్రస్థాశ్రమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రత మాచరించుచుక మక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీక వ్రతము అత్యంతఫల ప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలను. ఈ కథ చదివినవారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.

బుధవారం, డిసెంబర్ 05, 2012

కార్తీక పురాణం 22వ రోజు

బుధవారం, డిసెంబర్ 05, 2012


పురం జయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట, మరల అత్రి మహాముని అగస్త్యునిట్లు చెప్పదొడగెను 
కార్తీక పురంజయుడు వశిష్టులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియైదేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నానమాచరించి తనగృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు- మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపెంచి రాజా! విచారింపకుము నువ్వు వెంటనే చెల్లాచెదురైయున్నని సైన్యము కూడా దిసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలెకపోయినవి. అదియునుగాక, శ్రీ మన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్నివిధములా సహాయపడెను. అంతయు శ్రీ మన్నారాయణుని మహిమయే గదా! ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి " పురంజయారక్షింపుము. రక్షింపు" మని కేకలు వేయుచుపారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించెను. శ్రీ మన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా " శ్రీ హరి" అని ప్రార్ధించి త్రాగగా అమృత మైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును దృవుడు చిరంజీవియే గదా! హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. ఆ ధర్మము ధర్మముగా మారును. దైవను గ్రహము లేని వారికి ధర్మమే ఆ ధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మసమంతయు నది స్నాన మొనరించి దేవాలయంలో జ్యోతియిన్ వెలిగించి దీపారదానా చేసినచో సర్వ విపత్తులును పటా పంచలగును. అన్ని సౌఖ్యములు సమ కూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రత మాచరించు వారికి యే జాతి వారి కైనా పుణ్యము సమానమే బ్రాహ్మణా జన్మ మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్య మైనచో శూద్ర కులముతో సమన మగును. వేదా ద్యయన మొనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతా నుష్టన తత్పరుడైన వైష్ణ వోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ౦డును. సంసార సాగాల ముత్తరించుటకు దైవ భక్తి యే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణ నాతితము వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహా ఋషులు - మరెందరో రాజా ధి రాజులూ కూడా విష్ణు భక్తి చె ముక్తి నొందిరి. శ్రీ హరి భక్త వత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడు చుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచించ్చి యైనను మరి యొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించ వచ్చును. శ్రీ హరి -భక్తులు అన్యోన్య సంబందికులు అందు వలన లోక పోషకుడు, భక్త రక్షకుడైన అది నారాయణుడు తన భక్తులకు సదా సంపద ల నొసంగి కాపాడుచుండెను.  శ్రీ మన్నా రాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యనందుడు, విరజక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షి యంది డుకొని కాపాడు చున్న అది నారాయణుడు అటువంటి శ్రీ మహా విష్ణువునకు అతి ప్రియమైన కార్తిక మాస వ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీ మహా విష్ణువు లక్ష్మి సమేతుడై వెలయ గలడు. ఆ యిట్లు సిరి సంపదలతో కల కలలాడును. కార్తిక మాసములో శుచియై పురాణ ప టనము చేసినచో పితృ దేవతలు సంతసించెను. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

సీ|| ఎవ్వరి గరుణి ౦ ప నిచ్ఛ యించితి వాని యఖిల విత్తంబు నే సప హరింతు
సంసార గురు మద స్తబ్ధుడై యెవ్వడు దెగడి లోకము నున్న ధిక్కరించు
నత డెల్ల కలంబు నఖిల యో నుల యందు బుట్టుచు దుర్గతి బొందు బిద ప
విత్త వ యో రూప విద్య బలై శ్వర్య కర్మ జన్మ౦బుల గర్వ ముడిగి

గీ|| యేక విధమున విమలు డై యెవ్వడుండు వాడు నాకూర్చి రక్షింప వలయు వాడు స్తంభ లోకాభి మాన సంసార విభవ మత్తుడైన చెడ నొల్లడు మత్పరుండు

మంగళవారం, డిసెంబర్ 04, 2012

రచ్చ కెక్కితివి

మంగళవారం, డిసెంబర్ 04, 2012

రచ్చ కెక్కితివి పండరంగి విఠలా
పచ్చిదేరే వింతలోనే పండరంగివిఠలా

గుట్టుగల దొరవని కొసరి చూచినంతనె
రట్టుగా నవ్వేవు పండరంగి విఠలా
మట్టుమీరి తమకపు మాటలనె నీవలపు
బట్టబయలె సేసేవు పండరంగి విఠలా

సాగినసబలలోన సన్న సేసినంతలోనే
రాగిదేలించేవు పండరంగి విఠలా
వేగిరపు చేతలనె విరిని నీ మోహమెల్ల
బాగుగా వెళ్ళ వేసేవు పండరంగి విఠలా

సతినీవున్నచోటికి దగ్గర వచ్చినంతనె
రతి గూడితివి పండరంగి విఠలా
గతియైన శ్రీవేంకటనాథ యేలితివి
పతివై కోవిలకుంట్ల పండరంగి విఠలా

కార్తీక పురాణం 21వ రోజు

పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట
ఈవిధముగా యుద్దమునకు సిద్దమైవచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వ సైనికునితోను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు, మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరులడీకొనుచు హుంకరించుకొనుచు, సింహనాదములు చేసికొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పురించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, - హాహా కారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే ఆ మహా యుద్దమును వీరత్వముజూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలురసైన్యము చాలా నష్టమై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతిసాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్దసైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారి పోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దు:ఖించుచుండెను ఆసమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీవద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందుననే యీయుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాటలాలకింపుము. జయాపజయాలు దైవాదానములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగిపోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేవి, నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదానికి అపజయము కలిగినది? గానలెమ్ము. శ్రీహరి నీమదిలో దలచి నేను తెలియజేసినటులచెయు" మని హితోపదేశము చేసెను.


శ్లో// అపవిత్ర: పవిత్ర వానానావ స్దాన్గతోపివా
య: స్మరేతుడరీకాక్షం స బాహ్యాభంతరశుచి||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)