శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట
అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగగా అత్రిమహాముని యిట్లుచెప్పిరి- కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షతత్పరుడు, నితాన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదవెదా౦గవేత్తయై యుండను మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్నియేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పు రుషులలో వుత్త ముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏదేశమున, యేకాలమున, యేక్షేత్రమున యేవిధముగా శ్రీహరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీ వచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవీ సంసారసాగరమున దాటి మోక్ష ప్రాప్తినొందుదువు" అని పలికెను. అంతటా పురంజయుడు యాశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమద్యమున నున్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శేషశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచిపరవశమొంది, చేతులు జోడించి, " దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషి కేశా! ద్రోపది మాన సంరక్షకా! ధీన జన భక్త పొషా ! ప్రహ్లాదవరదా! గరుడ ధ్వజా ! కరి వరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్ర మును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పితదుపరి సపరివారుముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో , పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వార ములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్యసంయుత మై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయతలోచనులూ నైవిపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రాఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నలై, సదా మోహన హసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగ నలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషిత లై చిద్విలాసహసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.పురంజయుడు శ్రీ రంగక్షాత్రమున కార్తిక మాసవ్రత మాచరించి సతీ సమేతుడై యింటికి సుఖిముగాజేరేను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతుర్యధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత: పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియైదైవ భక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహికవాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారము వప్పిగించి పట్టాభిషీకూనిచేసి తను వానప్రస్థాశ్రమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రత మాచరించుచుక మక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీక వ్రతము అత్యంతఫల ప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలను. ఈ కథ చదివినవారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.