Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 24, 2012

తిరుప్పావై (నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్) 10వ పాశురం

సోమవారం, డిసెంబర్ 24, 2012

శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను . ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది. ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాష్ట తో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్ పాశురము:
  
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

நோற்று(ச்) சுவர்க்கம் பாடல் வரிகள்:
நோற்று(ச்) சுவர்க்கம் புகுகின்ற அம்மனாய்
மாற்றமும் தாராரோ வாசல் திறவாதார்
நாற்ற(த்) துழாய் முடி நாராயணன் நம்மால்
போற்ற(ப்) பறை தரும் புண்ணியனால் பண்டு ஒரு நாள்
கூற்றத்தின் வாய் வீழ்ந்த கும்ப கரணனும்
தோற்றும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ
ஆற்ற அனந்தல் உடையாய் அருங்கலமே
தேற்றமாய் வந்து திறவேலோர் எம்பாவாய்

Lyrics of Notru Chuvarkam :
nOtru(ch) chuvarkkam puguginRa ammanaay!
maatramum thaaraarO vaasal thiRavaadhaar
naaRRa(th) thuzhaay mudi naaraayaNan nammaal
pOtra(p) paRai tharum puNNiyanaal pandu oru naaL
kootraththin vaay veezhndha kumba karaNanum
thOtrum unakkE perunthuyil thaan thandhaanO
aatra anandhal udaiyaay arungalamE
thEtramaay vandhu thiRavElOr empaavaai

తాత్పర్యము:   
మేము రాక ముందు నోమునోచి , దాని ఫలముగా సుఖనుభావమును పోందినతల్లీ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, ఒక మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరింఛిన  కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుషార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నూతి లో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాఢ  నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషణమైనదానా! నిద్రనుండి లేచి, మత్తును వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు.  కప్పుకొని ఉన్న దుప్పటిని తొలగించి ఆవరణములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు. అని ఈ పాశురములో అంటున్నారు.

ఆదివారం, డిసెంబర్ 23, 2012

తిరుప్పావై (తూమణి మాడత్తు చ్చుత్తుం)9వ పాశురము

ఆదివారం, డిసెంబర్ 23, 2012

తిరుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు.  తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని.  ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు.  తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు.   ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని  నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం.  ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.

తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము: 
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్

దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్


தூமணி மாடத்து பாடல் வரிகள்:

தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய(த்)

தூபம் கமழ(த்) துயிலணைமேல் கண் வளரும்
மாமான் மகளே மணி(க்) கதவம் தாழ் திறவாய்
மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தான்
ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ
எம(ப்) பெருந்துயில் மந்திர(ப்) பட்டாளோ
மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று
நாமம் பலவும் நவின்றேலோர் எம்பாவாய் 




Lyrics of Thoomani Madathu :
thoomaNi maadaththu sutrum viLakkeriya(th)
thoopam kamazha(th) thuyilaNaimEl kaN vaLarum
maamaan magaLE maNi(k) kadhavam thaazh thiRavaay
maameer avaLai ezhuppeerO un magaL thaan
oomaiyO anRi sevidO ananthalO
Ema(p) perunN thuyil mandhira(p) pattaaLO
maamaayan maadhavan vaikundhan enRenRu
naamam palavum navinRElOr empaavaai

తాత్పర్యము: 
ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.  నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.

హిందూ పవిత్రగ్రంధం భగవద్గీత పుట్టినరోజు.


గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు.
ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.  
గీతా మహాత్మ్యం గురించి వరాహ పురాణమునందు ఇలా వుంది.
భూదేవి:  విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?
విష్ణువు:  ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.  తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయువానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.  ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.  ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యాస్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.  ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.  నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాసమందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.  గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.  ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును. గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు. గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.  ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును. ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,వారు ఇంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.  మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును. ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును పొందును. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే. అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది. గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు. 
సూతుడు: శౌనకాది ఋషులారా! ఈ ప్రకారనముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.
 ఆధునిక సైన్స్‌ యుగంలో కూడా గీతా సారానికి ప్రాధాన్యత చెక్కుచెదరడంలేదు. సాపేక్ష సిద్ధాంతవేత్త ఆల్బర్డ్‌ ఐన్‌స్టీన్‌ నుంచి అణుబాంబ్‌ రూపకర్త రాబర్ట్‌ఒపెన్‌హైమర్‌ వరకు, ప్రపంచ శాంతిదూత మహాత్మాగాంధీ నుంచి మార్టిన్‌ లూథర్‌కింగ్‌, డాక్టర్‌ అల్బర్ట్‌ స్విగ్జర్‌, హెర్మెన్‌హైసే, రాల్ఫ్‌వాల్డో ఎమర్సెన్‌, ఆల్డస్‌హక్సలీ, రుడోల్స్‌స్టైనర్‌, నికోలాటెల్సా వరకు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిఒక్కరు ఈ భగవద్గీతను ఔపోసన పట్టేశారు. దాన్ని విశ్వసించారు. తమ చర్యలకు, గీతాసారానికి సారూప్యతుందని స్పష్టం చేశారు. 
గీతలో విశిష్టమైన మొదటి శ్లోకం:   గీత మొత్తంలో ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్పిన శ్లోకం
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1||
ధృతరాష్ట్రుడు పలికెను.
 సంజయాయుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకుచేరియున్న నా కుమారులునుపాండవులును ఏమి చేసిరి?

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.



హిందువుల పండుగలలో వైకుంఠ పదంతో రెండు ఉన్నాయి. ఒకటి వైకుంఠ చతుర్దశి, రెండు వైకుంఠ ఏకాదశి. అయితే ఈ రెండు పర్వాలు ఆంధ్ర ప్రాంతంలో వేరుపేర్లతో పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశిని ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌర మాన ప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్ర మణం, మకరసంక్రమ ణం మున్నగు పర్వాలవలె ఇది కూడ సౌరమానాన్ననుసరించి తెలుగు వారు జరిపే పండుగలలో ఒకటి. ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది.
ఇది వైష్ణవులకు, రామానుజ, మాధ్వమతస్థులకు చాలా ముఖ్య మైనది. అయినప్పటికీ దీనిని అందరూ ఈ ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారు. పంచాగ కర్తలు ఈనాటి వివరణలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవం అని వ్రాస్తారు.
ఒకటి స్వర్గ ద్వారం, రెండు ముక్కోటి, మూడు వైకుంఠం. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో నిర్యాణమైనవారు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణంచేత ఈ పండుగకు దక్షిణా దిని కొన్ని ప్రాంతాలలో స్వర్గ ద్వారం అనే నామం కూడా ఉంది.  ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)