గురువారం, ఏప్రిల్ 11, 2013
బుధవారం, ఏప్రిల్ 10, 2013
హోమియోపతీ
బుధవారం, ఏప్రిల్ 10, 2013
హోమియోపతీ మందులు అనగానే
మాలాంటి పిల్లలకి చాలా ఇష్టం కదా! హోమియోపతి మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా
అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. అతిముఖ్యంగా భారత దేశంలో అత్యంత
ఎక్కువగా ప్రజలు వాడుతున్నట్టు ప్రపంచంలో ఇంకెక్కడా వాడటంలేదు. ఈ
హోమియోపతి మందును దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి
ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారం లేదట . హోమియోపతీ
అనగా హోమోయిస్ ఒకే రకమైన బాధ, మరియు ఒక రోగ లక్షణం. ఇది రెండు గ్రీకు
మాటలని కలపగా వచ్చిన పదము. దీనిని పుట్టుకగురింఛిన విషయాలు తెలుసుకుందాం.
మనకు అతి సుపరిచితమైన సామెతలు వున్నాయి ముల్లును ముల్లుతోనే తీయాలి
మరియు ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక
పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని
మందుగా వాడాలి అన్నది హోమియోపతీ యొక్క మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ
మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్. ఈరోజు
సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు అందుకే ఈ హోమియోపతి మందు గురించి చెప్తున్నాను. సేమ్యూల్ హానిమాన్ 1755-1843
అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి వైద్యశాస్త్రం
అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం
మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం తెసేసేవారు.
దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి
అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు . కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి
తప్పులుగా అనిపించింది . ఈ తప్పులను మార్చటానికి ఈయన కొత్త పద్దతిని
కనిపెట్టాడు. ఆ కొత్త పద్దతే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన
తరువాత హోమియోపతీ మందులు నమ్మకము వున్నవారు "ఇంగ్లీషు వైద్యాన్ని"
ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. పూర్వం నుండి హోమియోపతి
మందులు వాడినంత కాలం ఆహారనియమాలు పాటించాలి అని చెప్పేవారు. ex : onion
వాడకూడదు అని ఇంకా అలాంటివి వుండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు
కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడుఇప్పుడు ఆహారనియమాలు లేకుండా
వాడుకునే విదంగా తయారు చేస్తున్నారు. హోమియోపతి మందులు వాడితే ఎటువంటి
అనారోగ్యమైనా శాశ్వితముగా తగ్గుతుంది అంటారు. సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు సందర్భముగా హోమియోపతి గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇంకో సందర్భములో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. హోమియోపతి వాడకమువల్ల ఏ ప్రతికూల లేదా దుష్ప్రభావాలు లేకుండా నిశ్చయముగా నయంఅవ్వటం అనది విశేషముగా వుంది.
లేబుళ్లు:
కధలు,
కమామిషులు,
పరిశోధకులు,
పుట్టిన రోజులు,
photos
శుక్రవారం, ఏప్రిల్ 05, 2013
హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు.
శుక్రవారం, ఏప్రిల్ 05, 2013
మహాత్మా గాంధీగారు బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉప్పు పన్నువిధించినందుకు సవాలు చేస్తూ. 61సంవత్సరాల వయస్సులో మహాత్మా గాంధీగారు, తో పాటు 78 అనుచరులు తో కలసి 23 రోజుల్లో 240 మైళ్ళ దూరం దండి మార్చ్ చేసారు. ఈ దండి యాత్ర ముఖ్య ఉద్దేశము మనము ఎంతైనా తెలుసుకోవాలి. ఈ ఉప్పు సత్యాగ్రహము మొదట గాంధి గారిచే ప్రారంభించబడిన అహింసా ప్రచార ఉద్యమంగా మన చెప్పుకోవచ్చు. ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగింది. ఉప్పుపై పన్ను కట్టుటకు నిరసనగా మార్చ్ 12 ,1930 న మొదలు పెట్టారు ఈ దండి యాత్ర . ఈ దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహముగా చెప్తారు. ఈ ఉద్యమము వెనకాల ప్రధానమైన ఉద్దేశము వుంది బ్రిటిష్ వారిని మనదేశము నుండి తరిమి కొట్టి మనదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించుట అనేది ముఖ్యమైన ఉద్దేశము. ఈ దండి యాత్ర సబర్మతి ఆశ్రమము నుండి ప్రారంభించి దండి వరకు కొనసాగించారు. ఈ యాత్రలో కొన్ని వేలమంది భారతీయులు పాల్గొన్నారు. ఈ దండి యాత్ర పూర్తిగా విజయవంతము అయినట్టుగా చెప్పచ్చు. ఈ దండి యాత్ర 5 వ ఏప్రిల్ 1930 న దండి ప్రదేశానికి చేరుకుంది. 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.కోట్ల భారతీయులపై బ్రిటిష్ వారు వేసేన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మౌనముగానే (సత్యాగ్రముతో) ప్రారంభించి చిట్టచివరికి ఆ మౌనముతోనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించారు . ఇది చాలా గర్వించదగ్గ సంగతిగా చెప్పచ్చు. హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు.
గురువారం, ఏప్రిల్ 04, 2013
కృత్రిమ గుండె
గురువారం, ఏప్రిల్ 04, 2013
డాక్టర్ డెంటన్ A కూలే ఒక మానవ శరీరములో మొట్టమొదటగా ఒక కృత్రిమ గుండె ఇంప్లాంట్ చేసిన మొదటి అమెరికన్ సర్జన్ మరియు గుండె-మార్పిడి అను దానికి మార్గదర్శకుడు గా వున్నవాడు. మొట్ట మొదట 1960 లో ఆయన పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి తో శిశువుల హృదయాలలో న సున్నితమైన శస్త్రచికిత్స చేసారు తరువాత విజయవంతంగా pulmonary embolism (ఒక గడ్డకట్టిన రక్తము యొక్క భాగము ద్వారా పుపుస ధమని యొక్క ప్రతిష్టంభన) ను తొలగించటము చేసిన మొదటి సర్జన్ ఈయన. 3 మే 1968, కూలీ తన మొదటి మానవ గుండె మార్పిడి ప్రదర్శించారు.
కృత్రిమ గుండె |
మానవవుని లో అమర్చిన మొదటి మొత్తం కృత్రిమ గుండెను, ఈ పరికరం Liotta చాలా కృషి చేసి అభివృద్ధి చేశారు మరియు హౌస్టన్ లోని సెయింట్ లూకా యొక్క ఎపిస్కోపల్ హాస్పిటల్ వద్ద, ఏప్రిల్ 4, 1969 న సర్జన్ డెంటన్ కూలే ద్వారా అమర్చారు. కార్ప్ అను రోగికి ఈ కృత్రిమ గుండెను ఏర్పాటు చేసారు.
సంఖ్య దాత గుండె వ్యాధి గుండె కండరాలతో మరణిస్తున్న 47 ఏళ్ల రోగి అందుబాటులో ఎందుకంటే 4 న April 1969,, అతను ఒక తాత్కాలిక చర్యగా సిలికాన్ తయారు చేసిన యాంత్రిక గుండె అమర్చిన. ప్రయోగాత్మక కృత్రిమ గుండె 65 గంటల ఉపయోగించారు, ఈయనకు ఒక దాత గుండె దొరికేవరకు తాత్కాలికంగా వుంచుటకు ఉపయోగించారు. మరియు ఒక మానవ గుండె అందుబాటులోకి వచ్చినపుడు తొలగించారు..
కార్ప్ నిజమైన గుండె పొందిన తరువాత వెంటనే మరణించారు అయినప్పటికీ ఈ విధానం ద్వారా గుండె రోగులలో కృత్రిమ గుండె మార్చవచ్చు అని ప్రయోగాత్మకంగా చూపించి. గుండెమీద కొత్త ప్రయోగాలు చేయటానికి నాంది వేసారు. చాలా మంది ఈ శాస్త్ర చికిత్సని అనైతిక శస్త్రచికిత్స గా విమర్శించారు. నేటి రోజున కృత్రిమ హృదయ మార్పిడికి పునాది వేసినది కూలే.
లేబుళ్లు:
కమామిషులు,
పరిశోధకులు,
Events,
greetings,
photos
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)