ఆదివారం, జులై 21, 2013
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను
మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే ప్రతీ ఆదివారము 05:00 pm to 06:00 pm వరకు
మీ అభిమాన ఆన్లైన్ రేడియో RadioJosh Masth Maza Masth Music :) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .
INDIA= +91 04042410008
USA = +19142147574

Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
Thank u very much.
శనివారం, జులై 20, 2013
ఈరోజు నాకు చాలా ఇష్టం అయిన శాస్త్రవేత్త పుట్టినరోజు. ఆయన ఎవరో తెలుసుకుంటారా. ఈరోజు 1822 జులై 20 న జన్యు శాస్త్రానికి ఆద్యుడు గ్రెగర్ జాన్ మెండెల్ జన్మదినము. ఈయన ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్ గ్రెగర్ మెండెల్. అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన జోహన్ గ్రెగర్ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు. మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి. మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది. జన్యుశాస్త్రం వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు.జన్యువులు
డి.ఎన్.ఎ. నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.
మెండల్ అనువంశిక సిద్ధంతములు:
సంయోగ బీజాల శుద్ధతా సిద్ధాంతం: సంకరంలో కలిసివుండే రెండు యుగ్మ వికల్పాలు సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన ద్వారా విడిపోయి వేర్వేరు సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన శుద్ధమైన సంయోగబీజాలు ఏర్పడతాయి.స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: రెండు లేదా అంతకంటే ఎక్కువ జతల లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంకరణం జరిపినప్పుడు, ఒక జత లక్షణాలు (జన్యువులు) ఇంకొక జత లక్షణాలతో సంబంధం లేకుండా సంయోగబీజాల్లోకి పంపిణీ అవుతాయి.ఈయన గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా వుంది. మనబ్లాగ్ ద్వారా ఈ గొప్ప శాస్త్రవేత్త కు నివాళి అర్పిస్తున్నాం.
శుక్రవారం, జులై 19, 2013
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు. ఆనాడు ఉపవాస తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు. అదే రోజును తొలి ఏకాదశి గా భావిస్తారు.
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు.
అందరికీ ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
గురువారం, జులై 04, 2013
అల్లూరి సీతారామ రాజు మన ఆంద్రప్రదేశంలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు. ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి. అల్లూరి సీతామరాజు 4 జూలై 1897 లో పాండ్రంగి అనే ఉరిలో విజయనగరం జిల్లా దగ్గర వెంకట రామరాజు మరియు సూర్యనారాయణమ్మ లకు జన్మించారు. వీరికి ఒక తమ్ముడు సత్యనారాయణరాజు మరియు చెల్లి సీతమ్మ కలరు. మనకు చరిత్రనుండి చూస్తే
రక్తపాతం జరగకుండా ఉన్న ఉద్యమాల్లేవు. అంతేకాదు రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులు కూడా వున్నారు. వారిలో గాంధీజీ మన జాతీయ కథానాయకుడు అని మనకు తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు మన ఊరి విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగా కూడదు అని మన మన్యం వీరుడు అనేకసార్లు ఆపుచేసాడు. అల్లూరి సీతారామ రాజును మనము ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువుపై నిప్పులు కురిపించిన మన్యం అగ్నికణం అల్లూరి సీతారామరాజు, ఈయన విప్లవ పోరాట సమయం మొత్తం జీవితకాలం గా మనం చెప్పుకోవచ్చు లెక్కకు వస్తే అల్లూరి సీతారామరాజు 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పుకుంటారు. అసలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఒకలేఖ రాసారు నేను మీకు లొంగిపోతున్నాను అని. కానీ బ్రిటిష్ వారు రుదర్ ఫర్డ్ అద్యక్షణ తో కాల్చి చంపేశారు. ఈ వీరుని కద ముగించేసారు . ఈరోజు విప్లవజ్యోతి అయిన శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి 116 వ జయంతి సందర్బముగా ఆయని గుర్తుచేసుకొని హృదయపూర్వక నివాళి అందిద్దాం.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ