Blogger Widgets

శనివారం, జులై 20, 2013

గ్రెగర్ జాన్ మెండెల్ @ లాస్ ఆఫ్ హెరెడిటీ

శనివారం, జులై 20, 2013

ఈరోజు నాకు చాలా ఇష్టం అయిన శాస్త్రవేత్త పుట్టినరోజు.  ఆయన ఎవరో తెలుసుకుంటారా.  ఈరోజు 1822 జులై 20 న  జన్యు శాస్త్రానికి ఆద్యుడు  గ్రెగర్ జాన్ మెండెల్ జన్మదినము.  ఈయన  ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌.  అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన జోహన్‌ గ్రెగర్‌ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్‌' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్‌ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు.  మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి  మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్‌ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి.  మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్‌ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది.  జన్యుశాస్త్రం  వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు.జన్యువులు
డి.ఎన్.ఎ. నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.
  
మెండల్ అనువంశిక సిద్ధంతములు:
సంయోగ బీజాల శుద్ధతా సిద్ధాంతం: 
సంకరంలో కలిసివుండే రెండు యుగ్మ వికల్పాలు సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన ద్వారా విడిపోయి వేర్వేరు సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన శుద్ధమైన సంయోగబీజాలు ఏర్పడతాయి.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: రెండు లేదా అంతకంటే ఎక్కువ జతల లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంకరణం జరిపినప్పుడు, ఒక జత లక్షణాలు (జన్యువులు) ఇంకొక జత లక్షణాలతో సంబంధం లేకుండా సంయోగబీజాల్లోకి పంపిణీ అవుతాయి.
ఈయన గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా వుంది.  మనబ్లాగ్ ద్వారా ఈ గొప్ప శాస్త్రవేత్త కు నివాళి అర్పిస్తున్నాం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)