Blogger Widgets

బుధవారం, సెప్టెంబర్ 04, 2013

"పేపర్ బాయ్స్"

బుధవారం, సెప్టెంబర్ 04, 2013

 "పేపర్ బాయ్స్" 
 ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే.  మనకు ఎలా తెల్లారుతుంది.  పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది.  మన ఇంటి ముందర పాల పేకట్లు మరియు ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో,  ఏమి జరగబోతోందో తెలపటానికి hot hot news paper వుంటుంది.  అవి చూసే కానీ మనకు తెల్లారిన feeling రానే రాదు.  వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని అదే. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు.  అయితే ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్.  వాతావరణం ఎలా వున్నా.  తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్   ఈరోజు ప్రపంచం అంతా  "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు"  జరుపుకుంటున్నారు.  మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" గా జరుపుకుంటున్నారు.  పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.

ఆదివారం, సెప్టెంబర్ 01, 2013

Catch me Live

ఆదివారం, సెప్టెంబర్ 01, 2013


శనివారం, ఆగస్టు 31, 2013

ఆట పాటల మేటి ఆదిభట్ల

శనివారం, ఆగస్టు 31, 2013


 హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.  ఈయన పూర్తి పేరు  అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి.  చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు.  ఈయన అష్టావధానిగా రాణించారు.  మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు హరికథసృష్టి చేశారు. వారు హరికథను సర్వ కళల సమాహారంఅని అభివర్ణించారు. నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి చేర్చారు.  ఈ కళా రూపాన్ని సృష్టించిన నారాయణ దాసు గారు తెలుగులోనూ,  సంస్కృతంలోను,  అచ్చతెలుగులోను హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణంపేర శ్రీరామ కథ, తెలుగు హరికధలుహరికధామృతం పేర శ్రీకృష్ణుని కథ సంస్కృతం హరికధలు మరియు గౌరాప్పపెండ్లి  హరికథ ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ)జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథకు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు.  అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం నారాయణ దాసుగారికి సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరమరియు హరికథ పితామహలాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరబిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే పంచముఖిఅంటారు.  ఈ ప్రజ్ఞను కూడా అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతిఅనడం అతిశయోక్తి కానే కాదు.   నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని గౌరవించి భారతి తీర్థ, ‘ఆట పాటల మేటిఅనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది. ఆదిభట్ల నారాయణదాసుగారు  2 జనవరి 1945 న మరణించారు.  
శ్రీ కృష్ణ మాయ హరికధ 
 ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైనఅనన్య సామాన్యమైనఅనితర సాధ్యమైనఅజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం.  హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి సందర్బంగా  వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం.   హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.  

గురువారం, ఆగస్టు 29, 2013

ఆంద్రామృతం బ్లాగుకు ఆరవ సంవత్సర శుభాకాంక్షలు

గురువారం, ఆగస్టు 29, 2013

మా తాతగారు  చింతా రామకృష్ణారావు గారు రాస్తున్న ఆంధ్రామృతం బ్లాగుకు పూర్తిగా ఆరు సంవత్సరములు నిండింది. తాతగారు బ్లాగ్ లో తెలుగు పదాలతో అందమైన  తెలుగు పద్యాలు తో బాగారాస్తున్నారు. మనం బ్లాగు లోకి ప్రవేశించే సరికి 

గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి.కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! . అను అందమైన తెలుగు పద్యముతో మనకు స్వాగతము పలుకుతుంది. మొదటి పోస్ట్ .  రాసినప్పటికీ తాతగారికి అస్సలు కంప్యుటర్ గురించి పెద్దగా అవగాహన లేదు.  అలా అలా చాలా పోస్ట్లు పెట్టారు.  ఇలా ఆరుసంవత్సరాలు ఎంతో కృషి చేసి మంచి మంచి పోస్ట్లు పెట్టారు.  ఎన్నో ఎన్నెనో పరిశోదనలు చేసారు .  ఎన్నో వర్గాలు పేరుతో పద్యాలు రాసారు .  అందరి అభిమానాన్ని పొందారు .  చాలా మందిని అనుచరులు గా పొందారు. ప్రస్తుతము వరకు  120698 మంది ఆంధ్రామృతం బ్లాగును వీక్షించారు . ఎంతో మందికి పద్య రచన మీద మంచిగా అవగాహన కలిగించారు.  వారికి ఉత్సాహాన్ని కలిగించారు.  మా తాతగారు ఇంకా ఇలానే చాలా సంవత్సరాలు బ్లాగు ఇలానే ఉత్సాహంగా రాయాలని కోరుకుంటూ . తాతకి మరియు ఆంద్రామృతం బ్లాగు కు ఆరవ సంవత్సర మరియు ఈరోజు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)