Blogger Widgets

గురువారం, సెప్టెంబర్ 05, 2013

శ్రీ గురవే నమ:

గురువారం, సెప్టెంబర్ 05, 2013

గురుకృప లేనిదే ఏవిద్య రాణించదు. అన్నది అక్షర సత్యము. ఏమి సాదించాలంటే మనకు పూర్తిగా ఒక్కరే దిక్కు మనకి అదే గురువు. ఆ గురువును మనం సత్కరించటానికి ఒక రోజు వుండటం నిజంగా మంచి విషయం.  మంచి గురువు మంచి శిష్యుని గురించి నిరంతరం వెతుకుతూనే వుంటారుట .  అలాంటి గొప్ప గురువుకు సత్కరించుకోవాలి.  మనకు పూర్తిగా తెలిసిన గురువు ప్రార్ధన 

గురు బ్రహ్మ, గురు విష్ణు 
గురు దేవో మహేశ్వరహ 
గురు సాక్షాత్ పరబ్రహ్మ 
తస్మై శ్రీ గురవే నమ:

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం.  కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే..!

ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను... విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందుగానూ సెప్టెంబర్ 5వ తేదీని "ఉపాధ్యాయ దినోత్సవం"గా "గురు పూజోత్సవం"గా జరుపుకుంటున్నారు.  భారతీయ సంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాలనాటి నుండి గురుశిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. భారతీయ పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే అవి గురువుకు దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి. గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి   భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట. 
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు. 

భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంపిక చెయ్యబడిన పుట్టినరోజు [5 సెప్టెంబరు 1888], లేదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధారణ గా పాఠశాల నివేదిక అయితే సాధారణ చర్యలు మరియు తరగతులు వేడుక, ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోబడతాడు యొక్క చర్యలు స్థానంలో అక్కడ, ఒక "వేడుక" రోజు భావిస్తారు. ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి.

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అని అనేవారు సర్వేపల్లి.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
అలాంటి సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము.

ఆ రోజు స్కూల్ లో మన టీచర్స్ మేము మాకు నచ్చిన టీచర్ లా తయారు అయ్యి ఒక గంట మేము టీచర్ లా పాటాలు చెప్తాము. తరువాత మా టీచర్స్ కు ముందుగా కుంకుమ బొట్టు పెట్టి , తరువాత గంధము పూసి, పండు , పువ్వులు, తాంబూలము, మరియు నేను స్వయంగా తయారుచేసిన గ్రీటింగ్స్   ఇచ్చి వారిని సత్కరించి వారినుండి wishes తీసుకుంటాము. మీము మా స్కూల్ లో teachers day బాగాజరుపుకుంటున్నాము.  

మీ అందరికీ కుడా టీచర్స్ డే (గురు పూజోత్సవ) శుభాకాంక్షలు. 

బుధవారం, సెప్టెంబర్ 04, 2013

"పేపర్ బాయ్స్"

బుధవారం, సెప్టెంబర్ 04, 2013

 "పేపర్ బాయ్స్" 
 ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే.  మనకు ఎలా తెల్లారుతుంది.  పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది.  మన ఇంటి ముందర పాల పేకట్లు మరియు ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో,  ఏమి జరగబోతోందో తెలపటానికి hot hot news paper వుంటుంది.  అవి చూసే కానీ మనకు తెల్లారిన feeling రానే రాదు.  వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని అదే. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు.  అయితే ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్.  వాతావరణం ఎలా వున్నా.  తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్   ఈరోజు ప్రపంచం అంతా  "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు"  జరుపుకుంటున్నారు.  మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" గా జరుపుకుంటున్నారు.  పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.

ఆదివారం, సెప్టెంబర్ 01, 2013

Catch me Live

ఆదివారం, సెప్టెంబర్ 01, 2013


శనివారం, ఆగస్టు 31, 2013

ఆట పాటల మేటి ఆదిభట్ల

శనివారం, ఆగస్టు 31, 2013


 హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.  ఈయన పూర్తి పేరు  అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి.  చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు.  ఈయన అష్టావధానిగా రాణించారు.  మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు హరికథసృష్టి చేశారు. వారు హరికథను సర్వ కళల సమాహారంఅని అభివర్ణించారు. నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి చేర్చారు.  ఈ కళా రూపాన్ని సృష్టించిన నారాయణ దాసు గారు తెలుగులోనూ,  సంస్కృతంలోను,  అచ్చతెలుగులోను హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణంపేర శ్రీరామ కథ, తెలుగు హరికధలుహరికధామృతం పేర శ్రీకృష్ణుని కథ సంస్కృతం హరికధలు మరియు గౌరాప్పపెండ్లి  హరికథ ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ)జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథకు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు.  అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం నారాయణ దాసుగారికి సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరమరియు హరికథ పితామహలాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరబిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే పంచముఖిఅంటారు.  ఈ ప్రజ్ఞను కూడా అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతిఅనడం అతిశయోక్తి కానే కాదు.   నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని గౌరవించి భారతి తీర్థ, ‘ఆట పాటల మేటిఅనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది. ఆదిభట్ల నారాయణదాసుగారు  2 జనవరి 1945 న మరణించారు.  
శ్రీ కృష్ణ మాయ హరికధ 
 ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైనఅనన్య సామాన్యమైనఅనితర సాధ్యమైనఅజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం.  హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి సందర్బంగా  వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం.   హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)